newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

మ‌తం ముద్ర బ‌లంగా వేస్తున్నారా..?

07-11-201907-11-2019 07:38:06 IST
Updated On 07-11-2019 16:45:57 ISTUpdated On 07-11-20192019-11-07T02:08:06.867Z07-11-2019 2019-11-07T02:07:39.600Z - 2019-11-07T11:15:57.862Z - 07-11-2019

మ‌తం ముద్ర బ‌లంగా వేస్తున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు ప్ర‌త్య‌ర్థి పార్టీ ఆయ‌న మ‌తాన్ని అన‌ధికారికంగా వాడుకుంటాయి. జ‌గ‌న్ క్రిస్టియ‌న్ కావ‌డంతో ఆ ముద్ర ఆయ‌న‌పై వేసే ప్ర‌య‌త్నం ఎప్పుడూ జ‌రుగుతూనే ఉంటుంది. కానీ, వైఎస్ వార‌సత్వంతో వ‌చ్చిన ఇమేజ్ ముందు ప్ర‌జ‌లు జ‌గ‌న్ మ‌తాన్ని ప‌ట్టించుకోలేదు.

హిందువులు గ‌తంలో వైఎస్‌కు, ఇప్పుడు జ‌గ‌న్‌కు మ‌తాన్ని ప‌ట్టించుకోకుండా ఓట్లేసి ముఖ్య‌మంత్రుల‌ను చేశారు. అయితే, గ‌తంలో వైఎస్ క్రిస్టియ‌న్ల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని, తిరుమ‌ల కొండల్లో చ‌ర్చి నిర్మాణానికి చేయించాల‌నుకున్నార‌ని, తిరుమ‌ల‌ను రెండు కొండ‌లుగా మాత్ర‌మే గుర్తించార‌ని, దేవాల‌యాల్లో అన్య‌మ‌త ప్ర‌చారం చేయించార‌ని ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు చేసే వారు. కానీ, ఈ ప్ర‌చారం పెద్ద‌గా ఫ‌లించ‌లేదు.

2014 ఎన్నిక‌ల్లోనూ జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ బైబిల్ ప‌ట్టుకొని ప్ర‌చారం చేయ‌డంతో మ‌ళ్లీ అన‌ధికారికంగా జ‌గ‌న్ క్రిస్టియ‌న్ అని, ఆయ‌న‌కు ఓటేయొద్ద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మికి ఇది ఎంతోకొంత కార‌ణం అనే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. 2019 ఎన్నిక‌ల్లో ఇటువంటి ప్ర‌చారాలు ఫ‌లించ‌క జ‌గ‌న్ అన్ని వ‌ర్గాల వారి ఓట్ల‌తో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు.

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్‌పై క్రిస్టియ‌న్ అనుకూలుడు అనే ముద్ర బ‌లంగా వేసేందుకు ప్ర‌త్య‌ర్థి పార్టీలు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌క‌ర‌కాల ప్ర‌చారాల‌కు దిగుతున్నాయి. నిజానిజాల సంగ‌తి ప‌క్క‌న పెడితే జ‌గ‌న్ క్రిస్టియ‌న్ మ‌తానికి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రిగింది.

మొద‌ట ప‌క్కా హిందువైన జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియ‌న్ అని, ఒక క్రిస్టియ‌న్‌ను హిందువుల ప‌విత్ర పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల తిరుప‌తి దేవాస్థానానికి ఛైర్మ‌న్‌ను చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది.

ఆ మ‌ధ్య తిరుమ‌ల కొండ‌ల్లో చ‌ర్చి క‌ట్టార‌ని ఓ వీడియోతో ప్ర‌చారం చేశారు. తీరా చూస్తే అది అట‌వీ శాఖ కార్యాలయంగా తేలింది. త‌ర్వాత శ్రీశైలం పుణ్య‌క్షేత్రంలో అన్య‌మ‌త‌స్తుల‌కు దుకాణాలు కేటాయించే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌డం వివాదాస్ప‌ద‌మైంది. జ‌గ‌న్ అమెరికాలో జ్యోతిప్ర‌జ్వ‌ళ‌న చేయ‌కుండా హిందువుల‌ను అవ‌మానించాడ‌నే మ‌రో ప్ర‌చారం కూడా చేశారు. చివ‌ర‌కు అది నిజం కాద‌నే తేలింది.

ఇక‌, తాజాగా సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం బ‌దిలీ అంశంలోనూ మ‌తం తెర‌పైకి వ‌చ్చింది. తిరుమ‌ల‌లో అన్య‌మ‌త‌స్తులైన ఉద్యోగుల తొల‌గింపు కోసం ఎల్వీ ప్ర‌య‌త్నించారు.

జ‌గ‌న్ ఆయ‌న‌ను హ‌ఠాత్తుగా తొల‌గించ‌డంతో క్రిస్టియ‌న్ కోట‌రీ ఒత్తిడితోనే జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌నే ప్ర‌చారం మొద‌లైంది. ఈ నిర్ణ‌యాన్ని హ‌ర్షిస్తూ ఓ క్రిస్టియ‌న్ సంఘం చేసిన ప్ర‌క‌ట‌న‌, కేకు క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్న ఫోటో వైర‌ల్ అయ్యింది.

దీంతో అంతా ఈ బ‌దిలీ వ్య‌వ‌హారం వెనుక ఏదో ఉందని అనుకున్నారు. దీంతో తేరుకున్న వైసీపీ ఈ ప్ర‌క‌ట‌న ఇచ్చిన వ్య‌క్తి గ‌త చ‌రిత్ర‌ను బ‌య‌ట‌కు తీసింది. జెరూస‌లేం మ‌త్త‌య్య అనే వ్య‌క్తి ఆధ్వ‌ర్యంలో ఈ కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్న త‌తంగం జ‌రిగింది. ఆయ‌నే ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం బ‌దిలీ క్రైస్త‌వుల‌కు అనుకూల‌మ‌నే విధంగా ప్ర‌క‌ట‌న ఇచ్చారు.

అస‌లు ఈ జెరూస‌లేం మ‌త్త‌య్య జ‌గ‌న్‌కు బ‌ద్ద‌వ్య‌తిరేకి. ఆయ‌న ఉండేది హైద‌రాబాద్‌లో. గ‌తంలో జ‌గ‌న్‌, బ్ర‌ద‌ర్ అనీల్‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న త‌ర‌చూ ప్రెస్‌మీట్లు పెట్టి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసే వారు.

త‌ర్వాత ఓటుకు నోటు కేసులో ఇరుకున్నాడు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌తో అప్ప‌టి టీడీపీ నేత‌లు జ‌రిపిన చ‌ర్చ‌ల‌కు మ‌ధ్య‌వ‌ర్తిగా ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ విష‌యాల‌న్నీ వైసీపీ శ్రేణులు బ‌య‌ట‌కు తీయ‌డంతో ఈ ప్ర‌చారానికి కొంత బ్రేక్ ప‌డింది.

ఇంత‌లో గుంటూరులోని ఓ వార్డు స‌చివాల‌యంలో క్రైస్త‌వులు ప్రార్థ‌న‌లు చేస్తున్నార‌నే మ‌రో వీడియో వైర‌ల్ అయ్యింది. దీనిపైనా జ‌గ‌న్ క్రైస్త‌వుల‌కు అనుకూల‌మ‌నే ప్ర‌చారం జ‌రిగింది.

అయితే, ప్రార్థ‌న‌లు జ‌రిగింది క‌మ్యూనిటీ హాల్‌లో అని, అది ఎవ‌రికైనా అద్దెకు ఇస్తార‌ని, దానిపైన ఉన్న‌ది మాత్ర‌మే వార్డు స‌చివాల‌యం అని వైసీపీ శ్రేణులు కౌంట‌ర్ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

ఇవ‌న్నీ ఎలా ఉన్నా జ‌గ‌న్‌పై ఒక మ‌తం ముద్ర వేయాల‌నే ప్ర‌య‌త్నాలు మాత్రం అన‌ధికారికంగా పెద్ద ఎత్తున  జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఈ విష‌యంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వు. మ‌రీ, ముఖ్యంగా ఏపీలో వైసీపీకి ప్ర‌త్యామ్నయంగా ఎద‌గాల‌ని భావిస్తున్న‌ బీజేపీకి ఇటువంటివి మంచి అవ‌కాశాలుగా మారుతాయి.

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   6 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   7 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   8 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   9 hours ago


తూర్పుగోదావరి  వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

తూర్పుగోదావరి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

   9 hours ago


కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

   14 hours ago


బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

   14 hours ago


సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

   15 hours ago


రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

   15 hours ago


మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

   15 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle