మోహన్ బాబు వర్సెస్ చంద్రబాబు..మళ్ళీ ఏమైంది?
04-11-201904-11-2019 17:49:35 IST
2019-11-04T12:19:35.146Z04-11-2019 2019-11-04T12:19:30.647Z - - 09-12-2019

ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్, రాజ్యసభ మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు ఈమధ్యకాలంలో మీడియాలో అంతగా కనిపించడంలేదు. తాజాగా మోహన్ బాబు మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడడం వైరల్ అవుతోంది. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు.. మోహన్ బాబు గురించి నేరుగా ప్రస్తావించారు. పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు క్రమశిక్షణ లేని వ్యక్తి అంటూ కామెంట్లు చేశారు. వాటికి తాజాగా మోహన్ బాబు ఘాటుగా స్పందించారు. వరుసగా ట్వీట్లు కూడా చేశారు.
మోహన్ బాబు ఏమని ట్వీట్ చేశారంటే..
‘చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
నా మనసును గాయపరిచావు. అన్న యన్. టి. ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.
క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!’’ అని సోషల్ మీడియాలో చంద్రబాబుపై తీవ్రంగా కామెంట్లు చేశారు మోహన్ బాబు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో మోహన్ బాబు చేసిన నిరసన, ధర్నా ఇద్దరిమధ్య మరింత దూరాన్ని పెంచిందనే చెప్పాలి. అప్పుడు కూడా చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు మోహన్ బాబు. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు-మోహన్ బాబు రియాక్షన్ తో ఏపీలో మరింత వేడెక్కింది వాతావరణం.



చంద్రబాబుపై ఆనం వ్యాఖ్యకు పడిపడి నవ్విన జగన్.. విభేదాలు తొలగినట్లేనా?
12 minutes ago

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్.. విప్ జారీ
an hour ago

ఓడిపోయాం. ఒప్పుకుంటున్నాం.. కర్నాటక్ బైపోల్స్పై శివకుమార్
2 hours ago

20 మంది ఎమ్యెల్యేలను ఎదుర్కొనడానికి 150 మందికి శిక్షణా?
2 hours ago

పవన్లో అసహనం పెరుగుతోందా?
3 hours ago

ఉల్లి కష్టాలపై పవన్ సూటి ప్రశ్న
3 hours ago

రహస్య జీవోలు.. జగన్ పారదర్శకత చేతల్లో చూపించరే?
4 hours ago

విషాదం.. ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ జయరాజ్ హఠాన్మరణం
5 hours ago

అధికారుల గొడవలు.. నివురుగప్పిన నిప్పులా ఏపీ సచివాలయం
6 hours ago

‘‘అంతా శరద్ పవారే చేశారు’’
8 hours ago
ఇంకా