newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

మోహన్ బాబు పంచ్ డైలాగ్‌లు

02-04-201902-04-2019 08:26:43 IST
2019-04-02T02:56:43.910Z02-04-2019 2019-04-02T02:56:30.193Z - - 26-08-2019

మోహన్ బాబు పంచ్ డైలాగ్‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీపై నిప్పులు చెరిగి.. వైసీపీ గూటికి చేరిన మంచు మోహన్ బాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మన విరోధి కాదు..పక్క రాష్ట్ర స్నేహితుడంటూ కొత్త అర్థం చెప్పారు. ప్రజల కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానన్న ఘనుడని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి వచ్చిన మోహన్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. వచ్చే ఎన్నికల్లో 135 సీట్లతో జగన్ రాష్ట్రంలో అధికార పగ్గాలు సొంతం చేసుకుంటారని ధీమా వ్యక్తంచేశారు.

నిత్యం జగన్‌పై కేసుల గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు...తనపై ఉన్న11 కేసుల గురించి ప్రజానీకానికి తెలియకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మోహన్ బాబు విమర్శించారు. చంద్రబాబు పరిపాలనలో మట్టి ఇసుక కూడా మిగల్చలేదని, ఆ పార్టీనేతలే  దోపిడీ చేశారని మండిపడ్డారు. 

ప్రజా సంక్షేమం కోరే వైయస్ రాజశేఖర్ రెడ్డిపై కులం ముద్ర వేసి...చంద్రబాబు నాయుడు మాత్రం తన వారిని మాత్రం వెంటేసుకొని పరిపాలన చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఇది చివరి అంకం అని, ఆయనకు ఇవే చివరి ఎన్నికలన్నారు మోహన్ బాబు. జగన్‌కు తగిన అనుభవం లేదన్న చంద్రబాబు విమర్శలకు మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు.  చంద్రబాబు నాయుడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి నమ్ముకున్న వారిని వెన్నుపోటు పొడిచే విషయంలో మాత్రం అనుభవం లేదన్నారు. లోకేష్ ఓటమి కోసం వైసీపీ నేతలు పనిచేయాలన్నారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle