newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

మోహన్ బాబుకి బీజేపీ ఆఫర్... జగన్‌కి షాకేనా?

06-01-202006-01-2020 14:50:27 IST
Updated On 06-01-2020 16:10:59 ISTUpdated On 06-01-20202020-01-06T09:20:27.560Z06-01-2020 2020-01-06T09:20:25.347Z - 2020-01-06T10:40:59.769Z - 06-01-2020

మోహన్ బాబుకి బీజేపీ ఆఫర్... జగన్‌కి షాకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీనటుడు మంచు మోహన్ బాబు పార్టీ మారబోతున్నారా?

సీఎం జగన్ కి మోహన్ బాబు ఝలక్ ఇస్తారా?

మోడీతో భేటీకి రాజకీయ ప్రాధాన్యత

బీజేపీలోకి రావాలన్న మోడీ

మోడీతో మోహన్ బాబు ఏం మాట్లాడారు? 

జగన్ తో మోహన్ బాబుకి బంధుత్వం

మంచు విష్ణుకి జగన్ బావ వరస 

జగన్ అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తారని వార్తలు

తాజా పరిణామాలపై వైసీపీ నేత మౌనం

నటుడు మోహన్ బాబు తాజా అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోడీతో మోహన్ బాబు భేటీ అయ్యారు. ఈ మేరకు మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని ఢిల్లీలో  సినీ నటుడు మోహన్ బాబు కలిశారని, అరగంటకు పైగా వీరిమధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మంచు లక్ష్మి కూడా డైనమిక్ లీడర్ ని కలిశామని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా బీజేపీకి రావాలని మోహన్‌బాబును మోడీ కోరినట్టు తెలుస్తోంది. 

Image may contain: 6 people, people standing and indoor

మోహన్ బాబుతో పాటు కొడుకు విష్ణు, కోడలు వెరోనికా, కూతురు లక్ష్మీ ప్రసన్న కూడా ప్రధానిని కలిశారు. కాగా 2019 ఎన్నికలకు ముందు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరుఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు రకరకాల పదవులు ఇస్తున్నారంటూ రూమర్స్ వినిపించాయి. కానీ వాటన్నింటిని ఈ సీనియర్ నటుడు ఎప్పటికప్పుడు కొట్టిపారేశారు. తాజాగా మోహన్‌బాబు పీఎంను కలవడం చర్చనీయాంశమైంది.

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం మార్పులు వస్తాయో ఎవరికీ అర్థం కావడంలేదు. గతంలో టీడీపీ ఎంపీగా పనిచేసిన మోహన్ బాబు తర్వాత టీడీపీకి దూరం అయ్యారు. గతంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేశారు. ఒకానొక సందర్భంగా చంద్రబాబు క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అంటూ ఘాటైన విమర్శలు చేశారు.

దీనిపై అంతే స్థాయిలో మోహన్ బాబు రిటార్ట్ ఇచ్చారు. గత ఏడాది నవంబర్ మాసంలో ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ఉద్దేశించి పలు కామెంట్స్ చేసారు మోహన్ బాబు "చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది’’అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 

2019 ఎన్నికల సమయంలో ఆలస్యంగా అంటే ఎన్నికల నామినేషన్ ముగిసిన అనంతరం మోహన్ బాబు..వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే,తాను ఏ పదవులు ఆశించి పార్టీలో చేరలేదని క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబుకి కీలక పదవి ఇస్తారని రెండునెలల క్రితం ప్రచారం సాగింది. తర్వాత ఈ ప్రచారానికి మోహన్ బాబే పుల్ స్టాప్ పెట్టారు. తాజాగా మోడీని కలవడంతో రాజకీయాలు మారతాయని భావిస్తున్నారు. త్వరలో మోహన్ బాబు బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే బంధువుకి మోహన్ బాబు ఝలక్ ఇచ్చినట్టేనని అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle