newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

మోదుగుల‌కు దారి దొరికిందా..?

06-03-201906-03-2019 11:46:17 IST
Updated On 06-03-2019 16:00:55 ISTUpdated On 06-03-20192019-03-06T06:16:17.522Z06-03-2019 2019-03-06T06:16:15.097Z - 2019-03-06T10:30:55.909Z - 06-03-2019

మోదుగుల‌కు దారి దొరికిందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎట్టకేల‌కు గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాజ‌కీయ ప‌య‌నానికి కొత్త దారి దొరికింది. గ‌త ఆరు నెల‌లుగా ప్రచారం జ‌రుగుతున్నట్లుగా ఆయ‌న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేశారు. త్వర‌లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఖాయ‌మైంది. ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆయ‌న వైసీపీలో చేర‌నున్నారు. 2009లో న‌ర‌స‌రావుపేట ఎంపీగా ప‌నిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు ప‌శ్చిమ నుంచి పోటీ చేయించింది. ఎమ్మెల్యేగా గెలిచినా మోదుగుల‌కు ఎంపీగా వెళ్లాల‌నే కోరిక‌నే ఉంది. అయితే, టీడీపీలో ఎంపీగా అవ‌కాశం దొరికే ప‌రిస్థితి లేదు. 

దీంతో పాటు పార్టీలో త‌న‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేద‌ని మోదుగుల‌ కొంత‌కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ప‌లుమార్లు బాహాటంగానే పార్టీ వైఖ‌రిని ఆయ‌న నిందించారు. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన రెడ్డి సామాజ‌క‌వ‌ర్గం స‌మావేశంలో ఏకంగా రెడ్డిని గెలిపించుకోవాల‌ని చెప్పిన ఆయ‌న ప‌రోక్షంగా వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల‌ని ఆకాంక్షించారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోదుగుల ప‌ట్ల వేచిచూసే ధోర‌ణితోనే ఉన్నారు.

ఎన్నడూ లేనిది ఇటీవ‌ల చంద్రబాబు స్వయంగా న‌ల్లష‌ర్టు వేసుకొని కేంద్రం వైఖ‌రిపై నిర‌స‌న తెలిపారు. పార్టీ ప్రజాప్రతినిధులంద‌రూ న‌ల్లచొక్కా ధ‌రించి అసెంబ్లీకి రావాల‌ని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల‌నూ మోదుగుల ధిక్కరించారు. దీంతో మోదుగుల పార్టీ మార‌డం అప్పుడే ఖాయ‌మైంది. అయితే, ఆయ‌న‌కు వైసీపీలోనూ ఇంత‌కాలం టిక్కెట్ విష‌యంలో స్పష్టమైన హామీ రాలేదు. మోదుగుల ఆశిస్తున్న న‌ర‌స‌రావుపేట పార్లమెంటు స్థానానికి ఇప్పటికే లావు శ్రీకృష్ణదేవ‌రాయ‌లు స‌మ‌న్వయ‌క‌ర్తగా ఉన్నారు. ఆయ‌నే అభ్యర్థిగా చాలారోజులుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు.

దీంతో ఆయన‌ను త‌ప్పించే ప‌రిస్థితి లేదు. ఇక‌, గుంటూరు పార్లమెంటు స్థానంపై మోదుగుల‌కు హామీ ల‌భించింద‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఇక్కడ వైసీపీ స‌మ‌న్వయ‌క‌ర్తగా కిలారి రోశ‌య్య ఉన్నారు. మోదుగుల చేరిక నేప‌థ్యంలో వైసీపీ ముఖ్యనేత బొత్స స‌త్యనారాయ‌ణ కిలారి రోశ‌య్యతో భేటీ అయి బుజ్జగించిన‌ట్లు తెలుస్తోంది. రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించినట్టు సమాచారం.

మ‌రోవైపు ఆయ‌న‌కు స‌త్తెన‌పల్లి అసెంబ్లీ స్థానం కేటాయిస్తార‌నే ప్రచార‌మూ జ‌రిగింది. కానీ, ఇక్కడి నుంచి పోటీకి ఆయ‌న ఇష్టంగా లేరు. పైగా మొద‌టి నుంచి పార్టీలో ఉన్న అంబ‌టి రాంబాబును త‌ప్పించ‌డం బాగుండ‌ద‌ని వైసీపీ భావిస్తోంది. మొత్తానికి మ‌రోసారి పార్లమెంటులోకి అడుగుపెట్టాల‌నుకుంటున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి క‌ల‌ను వైసీపీ అయినా నిజం చేస్తుందో లేదో చూడాలి. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle