newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

మోదుగులకు గల్లా సవాల్

08-03-201908-03-2019 07:25:52 IST
2019-03-08T01:55:52.189Z08-03-2019 2019-03-08T01:55:48.084Z - - 27-05-2020

మోదుగులకు గల్లా సవాల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబు ఆదేశంతో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి గెలిచారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. రాజకీయాల్లో సీనియర్ అయిన మోదుగులను తొలిసారి మంత్రివర్గంలోకి తీసుకోలేదు చంద్రబాబు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో కూడా తనకు అవకాశం ఇవ్వాలన్న మోదుగుల విన్నపాన్ని తోసిపుచ్చారు చంద్రబాబు. తనకు నర్సరావుపేట లోక్ సభ సీటు ఇవ్వాలన్న మోదుగుల కోరికను ఈ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.

పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని కల్సిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి... తాను వైసీపీలో చేరుతున్నట్లు చెప్పకనే చెప్పేశారు. ఇక చర్చల తర్వాత ఆయనకు నర్సరావుపేట లోక్ సభ టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ ఒప్పుకున్నట్లు మోదుగుల వర్గీయులు చెబుతున్నారు. అయితే తాజా పరిస్థితులలో ఇప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సీటు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గుంటూరు లోక్ సభ వైసీపీ కన్వీనర్‌గా లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. ఈయనకు గుంటూరు లోక్ సభ సీటు ఖరారు చేశారు జగన్. అయితే టీడీపీ నుంచి పోటీ చేస్తున్న గల్లా జయదేవ్‌‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని బరిలో దింపాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు లావు కృష్ణదేవరాయలు నర్సరావుపేట లోక్ సభ సీటు నుంచి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. నర్సరావుపేట లోక్ సభ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా కోడెల శివప్రసాద్ పోటీ చేస్తున్నారనీ... ఆయన్ని లావు కృష్ణదేవరాయలు సులువుగా ఓడిస్తారనేది జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది.

ఇదే సమయంలో గుంటూరు లోక్ సభ పరిధిలో‌ రెడ్డి సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉండటం కూడా మోదుగులకు కల్సొచ్చే అవకాశం ఉందనీ జగన్ భావిస్తున్నారు. అంటే గుంటూరు, నర్సరావుపేట లోక్ సభ సీట్లను సామాజికవర్గాల సమీకరణాలతో గెల్చుకోవాలన్నదే జగన్ వ్యూహంగా అర్థం అవుతోంది. ఇక గల్లా జయదేవ్ కూడా మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే గుంటూరు నుంచి తనపై పోటీకి రెడీ కావాలంటున్నారు.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   12 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   14 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   17 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   18 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   19 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   20 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   20 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   21 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   21 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle