newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

మోదీ కుట్ర మేలు చేసిందట..!

24-04-201924-04-2019 14:49:50 IST
Updated On 24-04-2019 18:16:17 ISTUpdated On 24-04-20192019-04-24T09:19:50.095Z24-04-2019 2019-04-24T09:19:48.404Z - 2019-04-24T12:46:17.557Z - 24-04-2019

మోదీ కుట్ర మేలు చేసిందట..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల్లో విజయంపై తెలుగుదేశం పార్టీలో క్రమంగా ధీమా పెరుగుతోంది. పోలింగ్ తర్వాత చంద్రబాబు ఈసీపై ఆరోపణలు చేయడం, ఈవీఎంలపై అనుమానాలు లేవనెత్తడం వంటి పరిణామాలతో టీడీపీ ఓడిపోబోతుందా అనే అనుమానాలు ఆ పార్టీ క్యాడర్ లోనూ నెలకొన్నాయి. ఓడిపోయే వారే ఇటువంటి సాకులు చెబుతారని వైసీపీ కూడా ఎద్దేవా చేసింది. చంద్రబాబు మాత్రం పలుమార్లు తాము మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పినా క్యాడర్‌లో ధీమా పెరగలేదు.

ఎన్నికల్లో పోలింగ్ సరళిపై ఆయన పార్టీ అభ్యర్థులతో సమీక్షలు జరుపుతున్నారు. క్షేత్రస్థాయిలో రిపోర్టులు తెప్పించుకున్నారు. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ బూత్ ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందో అంచనాలతో రిపోర్టులు తెప్పించుకున్నారు. వీటన్నింటినీ విశ్లేషించిన అనంతరం తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని చంద్రబాబు అభ్యర్థులకు చెబుతున్నారు. అయితే, నరేంద్ర మోదీ కుట్ర చేయాలనుకోవడమే తమకు కలిసి వచ్చిందని చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు అంటున్నారు. 

తనను దెబ్బకొట్టడానికి, ఎన్నికలకు సమయం ఇవ్వకుండా మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టారని, దీని వెనుక నరేంద్ర మోదీ కుట్ర ఉందనేది చంద్రబాబు వాదన. అయితే, ఈ కుట్రనే తమకు మేలు చేసిందని ఆయన అంటున్నారట. ఎన్నికలు ఏప్రిల్ చివరి వారంలో లేదా మేలో వస్తాయని చంద్రబాబు ముందునుంచీ అంచనా వేశారు. ఇందుకోసమే ఎన్నికల పథకాలైన పసుపు - కుంకుమ, అన్నదాత సుఖీభవతో పటు రైతు రుణమాఫీ డబ్బులు ఏప్రిల్ మొదట్లో ప్రజలకు బ్యాంక్ అకౌంట్లలోకి వేయాలని చంద్రబాబు ఏర్పాట్లు చేశారు. 

ఎవరు ఒప్పుకున్నా... ఒప్పుకోకున్నా ఈ పథకాల ఉద్దేశం మాత్రం ఓట్లను రాబట్టుకోవడమే. ఈ డబ్బులు బ్యాంకుల్లో పడ్డాక ప్రజలు కచ్చితంగా తమకే ఓటేస్తారని టీడీపీ నమ్మకం. ఎన్నికలు ఏప్రిల్ 11నే జరగడంతో ఈ పథకాల వల్ల తమకు మరింత మేలు జరిగిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ముందుగా ఏర్పాట్లు చేసినట్లే ఏప్రిల్ మొదటి వారంలో ఈ పథకాల డబ్బులు ప్రజలకు చేరాయి. డబ్బులు ప్రజలకు అందాక మూడు, నాలుగు రోజులకే ఎన్నికలు జరిగాయి. దీంతో ఈ పథకాల ప్రభావం ఆశించిన దాని కంటే ఎక్కువగా ఉందని టీడీపీ అంచనా వేసింది. ఈ పథకాలకు కృతజ్ఞతగానే ప్రజలు అర్థరాత్రి వరకు ఓపికగా ఉండి ఓట్లు వేశారని టీడీపీ భావిస్తోంది.

ఈ రకంగా తమకు సమయం లేకుండా చేయాలనే కుట్రతో మొదటి విడతలో ఎన్నికలు జరిపితే అది తమకు మేలే చేసిందని టీడీపీ ఒక అంచనాకు వచ్చేసింది. మరి ఈ పథకాల లబ్ధిదారులు నిజంగానే టీడీపీ వైపే ఉన్నారా, ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలు నిజమై టీడీపీనే గెలుస్తుందా చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle