newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

మోడీ, షా అనుమ‌తితోనే చేస్తున్నారా..?

22-08-201922-08-2019 08:10:11 IST
Updated On 22-08-2019 15:27:14 ISTUpdated On 22-08-20192019-08-22T02:40:11.803Z22-08-2019 2019-08-22T02:40:01.105Z - 2019-08-22T09:57:14.764Z - 22-08-2019

మోడీ, షా అనుమ‌తితోనే చేస్తున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డంలో తెలుగుదేశంతో పోటీ ప‌డుతోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న బీజేపీ.. రాష్ట్ర‌ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెట్టింది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేత‌లు వైసీపీని విమ‌ర్శించడంలో ముందుంటున్నారు. జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్‌, పీపీఏల పున‌స‌మీక్ష చేయాల‌ని జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను బీజేపీ నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పీపీఏల‌ను పున‌స‌మీక్షించ‌డంపై కేంద్ర ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శితో పాటు కేంద్ర‌మంత్రి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతూ లేఖ‌లు రాశారు.

ఇక‌, పోల‌వ‌రం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌కు కేంద్ర మంత్రి భిన్నంగా మాట్లాడారు. పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టింది.

అయితే, తమ ప్ర‌భుత్వం తీసుకుంటున్న కీల‌క నిర్ణ‌యాల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను సంప్ర‌దించే తీసుకుంటున్న‌ట్లు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చెప్పి బాంబు పేల్చారు. విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌తో ఇన్ని రోజులుగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్న రాష్ట్ర బీజేపీ నేత‌లు డిఫెన్స్‌లో ప‌డిపోయారు.

తాము తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు మోడీ, అమిత్ షా ఆమోదం ఉంది అనే అర్థం వ‌చ్చేలా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడటంపై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఇక‌, రాజ‌ధానిని మారుస్తామ‌ని సైతం జ‌గ‌న్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి చెప్పార‌ని టీడీపీ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించ‌డం కూడా సంచ‌ల‌నంగా మారింది.

రాజ‌ధాని మార్చాల‌ని ప్ర‌ధానికి జ‌గ‌న్ లేఖ రాశార‌నేది ఆయ‌న ఆరోప‌ణ‌. దీంతో బీజేపీ నేత‌లు కౌంట‌ర్ ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌కు బీజేపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు సుచ‌నా చౌద‌రి మండిప‌డ్డారు. తాను జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి, ఇంధన శాఖ మంత్రితో మాట్లాడాన‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌తో వారికి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించారు.

అయితే, ప్ర‌ధాని మోడీ, అమిత్ షాతో ఇంకా మాట్లాడ‌లేద‌ని, కానీ వారికి చెప్పి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకోలేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ వ్య‌వ‌హారం ఇంకా ఎక్క‌డి దాకా వెళుతుందో చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle