newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

మోడీ ప్రమాణం తర్వాతే జగన్ ప్రమాణ స్వీకారం?

22-05-201922-05-2019 08:42:00 IST
Updated On 27-06-2019 12:07:36 ISTUpdated On 27-06-20192019-05-22T03:12:00.549Z22-05-2019 2019-05-22T03:11:42.884Z - 2019-06-27T06:37:36.572Z - 27-06-2019

మోడీ ప్రమాణం తర్వాతే జగన్ ప్రమాణ స్వీకారం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో టీడీపీ గెలుస్తుందని అంచనా వేసినప్పటికీ... వైసీపీ వర్గాలు మాత్రం గెలుపు కచ్చితంగా తమదే అని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే... ఈ నెల 26 తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ముహూర్తం బాగుండటంతో జగన్ ఆ రోజు ప్రమాణస్వీకారం చేయడానికి నిర్ణయించుకున్నాడనే వార్తలు వినిపించాయి.అయితే తాజాగా తన ప్రమాణస్వీకారోత్సవం ముహూర్తంపై జగన్ మనసు మారిందని తెలుస్తోంది. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం తరువాత అంటే మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత నిర్ణయించుకున్నారని సమాచారం. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సూచనల మేరకే జగన్ తన ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది.

కొంతకాలంగా ఇలాంటి అంశాల్లో ఎక్కువగా స్వరూపానంద సూచనలు పాటిస్తున్న వైసీపీ అధినేత... ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తం విషయంలోనూ ఆయన సలహానే పాటించారని... అందుకే ముందుగా అనుకున్న ముహూర్తాన్ని కాదని కొద్ది రోజులు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 

జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మరో ట్విస్ట్ కూడా ఉంది. అమరావతిలో కాకుండా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆయన ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే రోజు జగన్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని మెజార్టీ మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఫలితాలు వచ్చిన తరువాత వారం రోజుల పాటు జాతీయ రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై వైసీపీ అధినేత దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. మళ్ళీ మోడీ వస్తారని ప్రచారం జరుగుతున్న వేళ, జగన్ మోడీ ప్రమాణ స్వీకారం తర్వాతే తాను ప్రమాణస్వీకారం చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. 

మరోవైపు వైసీపీకి 120 సీట్లు కూడా రావచ్చని ఆ పార్టీనేతలు అంచనా వేస్తున్నారు. అదే విధంగా 18 వరకూ ఎంపీ సీట్లు వైసీపీ సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గుబ్బల తమ్మయ్య న్యూస్ స్టింగ్ ప్రతినిధికి వివరించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం అవుతాయన్నారు తమ్మమ్య. లగడపాటి సర్వేలపై ఆయన పెదవి విరిచారు. మరోసారి ఆయన సర్వేల విషయంలో పప్పులో కాలేస్తున్నారని, విశ్వసనీయతకు సమాధి కడుతున్నారని ఆయన అన్నారు.  జగన్ ప్రమాణ స్వీకారం కోసం తామెంతో ఎదురుచూస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle