newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

మోడీ టూర్ లేనట్టే......మరి బాబు గెలిచినట్టేనా?

28-12-201828-12-2018 15:32:57 IST
Updated On 28-12-2018 15:33:51 ISTUpdated On 28-12-20182018-12-28T10:02:57.477Z28-12-2018 2018-12-28T10:02:55.332Z - 2018-12-28T10:03:51.129Z - 28-12-2018

మోడీ టూర్ లేనట్టే......మరి బాబు గెలిచినట్టేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ విషయంలో బీజేపీ నేతల తీరుని టీడీపీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కడిగిపారేస్తోంది. విభజన హామీలను విస్మరించిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని టీడీపీ నేతలు శాపనార్ధాలు పెట్టారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే తమ నిరసన తెలపాలని భావించారు. అయితే టీడీపీ నేతల ఆశ నెరవేరే అవకాశం లేకుండా పోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీ పర్యటన వాయిదా పడడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని నరేంద్రమోడీ జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పర్యటించాల్సి ఉంది. ముందుగా తిరువనంతపురంలో జరిగే సభలో పాల్గొని అనంతరం ఏపీ పర్యటనకు బయలుదేరతారని పీఎంవో వర్గాలు గతంలో ప్రకటించాయి. కానీ తిరువనంతపురంలో సభకు బదులు ...శబరిమల సమీపంలోని ‘పతనంతిట్ట’కు మార్చాలని ఆ రాష్ట్ర బీజేపీ శ్రేణులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తుండడంతో ఏపీ పర్యటన వాయిదా పడింది. దీంతో ప్రధాని అనుకున్న సమయానికి కేరళ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోలేరని...మోడీ ఏపీకి రావడంలేదని... త్వరలో మరో తేదీ ప్రకటిస్తామని ఏపీ బీజేపీ నేతలు చెప్పారు.

మరోవైపు ప్రధాని మోడీ పర్యటనను ఏపీ సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రధాని మోదీ ఏపీని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని చంద్రబాబు ఎప్పటినుంచో నిప్పులు చెరుగుతున్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి ఏమీ చేయని మోడీ ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారని నిలదీస్తున్నారు. ప్రధాని పర్యటనకు వచ్చినా దూరంగా ఉండటమే తమ నిరసన అని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. విభజన హామీలను కేంద్రం విస్మరించినా.. ఉక్కు సంకల్పంతో కడపలో స్టీల్‌‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని, మొక్కవోని దృఢసంకల్పంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు చంద్రబాబు. అంతేకాదు విభజన గాయంపై కారం పూయడానికే మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, ఏపీ ప్రజలకు ఏం చేశారని చెప్పడానికి వస్తున్నారని ప్రశ్నించారు. మోడీ రాష్ట్ర పర్యటన వాయిదా పడటం టీడీపీ విజయంగా భావిస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సైతం మోడీ పర్యటన వాయిదా వేసుకోవాలని సూచించారు.

మోడీ ఏపీ పర్యటన వాయిదా పడటంపై బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. కాగా, టీడీపీ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్చి తాను ఏపీకి ఏం చేశాననే విషయాన్ని చెబుతారని తాము భావించామని, ప్రధాని ఏపీలో కాలుపెడితే టీడీపీ దూకుడుకు కళ్లెం పడుతుందని ఆశించామన్నారు. పర్యటన వాయిదా అంశాన్ని టీడీపీ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రం కాకుండా కడప స్టీల్‌ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన చేయడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రన్న రాళ్లు పేరుతో ఏపీలో కొత్త పథకాన్ని ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ముడి ఖనిజం వివరాలు ఇవ్వకుంటే పెట్టుబడులు ఎలా పెడతారని జీవీఎల్‌ నిలదీశారు. ఈ మేరకు చంద్రబాబుపై జీవీఎల్‌ ట్విటర్‌లో స్పందిస్తూ రాయేగా పోయేదేముందని శంకుస్థాపన చేశారని వ్యంగ్యంగా అన్నారు. ఇప్సుడు పర్యటన వాయిదా పడడంతో..  ప్రధాని మోడీ జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో ఏపీ పర్యటన ఉండే అవకాశం ఉందంటున్నారు. 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   10 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   12 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   15 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   17 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   18 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   18 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   19 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   19 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   19 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle