newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

మోడీ గో బ్యాక్.. స్టీల్ సిటీలో టెన్షన్

01-03-201901-03-2019 12:56:43 IST
Updated On 01-03-2019 13:16:30 ISTUpdated On 01-03-20192019-03-01T07:26:43.998Z01-03-2019 2019-03-01T07:26:41.981Z - 2019-03-01T07:46:30.825Z - 01-03-2019

మోడీ గో బ్యాక్.. స్టీల్ సిటీలో టెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇవాళ ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయనకు నల్ల ఫ్లెక్సీలతో నిరసనలు తెలపాలని టీడీపీ, కాంగ్రెస్, ఏపీ ప్రత్యేక హోదా సాధనసమితి నిర్ణయించాయి. మోడీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు తొలగించడం ఉద్రిక్తతకు దారితీస్తోంది. మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. నల్లరంగులో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. మోదీ ప్రయాణించే మార్గాల్లో అనేక హోర్డింగ్‌‌లు వెలిశాయి. శుక్రవారం సాయంత్రం విశాఖలో జరిగే బహిరంగసభలో మోడీ పాల్గొంటున్నారు. 

ఇంతకుముందే గుంటూరు పర్యటన చేసిన ప్రధాని మోదీ.. మళ్లీ ఏపీ పర్యటనకు సిద్ధమయ్యారు. కేరళలోని తిరువనంతపురం నుంచి బయలుదేరి ఇవాళ సాయంత్రం 6:20 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 6:45 గంటలకు రైల్వే గ్రౌండ్స్‌కి వెళ్తారు. రాత్రి 7 గంటల నుంచి 7.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7.50 గంటలకు సభా ప్రాంగణం నుంచి బయల్దేరి 8.10 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకొని.. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళిపోనున్నారు మోడీ. 

మరోవైపు విశాఖ సభలో నరేంద్ర మోదీ ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. బుధవారమే విశాఖకు రైల్వే జోన్ ప్రకటించగా.. ఈ అంశం తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. రైల్వే జోన్ హామీని నిలబెట్టుకున్నామని చెబుతూనే.. ఏపీకి ఈ నాలుగున్నరేళ్లలో ఎలాంటి సాయం చేశామో చెప్పేందుకు ప్రధాని సిద్ధమవుతున్నారు. అయితే  అలాగే టీడీపీ టార్గెట్‌గా మరోసారి మాటల యుద్ధం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

ఏపీ ప్రత్యేక హోదా హామీ ఏమైందంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తిరుమల సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను గుర్తుచేస్తున్నారు. విశాఖ రైల్వేజోన్ కంటితుడుపు చర్యే అంటున్న టీడీపీ రైల్వేజోన్ విషయంలో మేం అడిగిందేంటి? మీరిచ్చిందేంటి? అంటున్నారు. ఆదాయం లేని జోన్‌తో  ఏపీకి ఒరిగేదేంటి అని టీడీపీ ఎద్దేవా చేస్తోంది. మోడీ గో బ్యాక్ .. అంటూ సాగరతీరంలో నినాదాలు హోరెత్తుతున్నాయి. మొత్తం మీద మోడీ ఏపీ పర్యటన మళ్లీ వేడిని రాజేస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle