newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

మోడీ... ఏ ముఖం పెట్టుకుని వస్తారు?

10-02-201910-02-2019 09:44:59 IST
2019-02-10T04:14:59.580Z10-02-2019 2019-02-10T04:14:45.773Z - - 17-07-2019

మోడీ... ఏ ముఖం పెట్టుకుని వస్తారు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మోడీ గో బ్యాక్.. అడుగడుగునా నిరసన 

 

విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ .. ఇవ్వని ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్‌కు రావద్దంటూ ఏపీ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం, వామపక్షాల ఆధ్వర్యంలో  జరుగుతున్న ఆందోళనలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి. విద్యార్ధి సంఘాలు సైతం ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. ఎటు చూసినా మోడీ గో బ్యాక్ అనే హోర్డింగ్‌‌లు కనిపిస్తున్నాయి.  

ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తెలుగు తమ్ముళ్ళకు దిశానిర్దేశం చేశారు. మన నిరసన దేశమంతా తెలియాలన్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ‘‘నిరసనతో మోడీ పర్యటనను ఎదుర్కొని చూడండి..ఏమవుతుందో తెలుస్తుందని..ప్రభుత్వం పడిపోయేదాకా తెచ్చుకోవద్దు’’ అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌  వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రధాని సభ నిర్వహణపై సందేహాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే...ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రధాని  నరేంద్రమోడీకి 25 అంశాలతో  ఒక లేఖ రాశారు. ప్రధాని మోడీ పర్యటనకోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీ బీజేపీ నేతలు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, యువజన విభాగం నేత విష్ణువర్ధన్‌ రెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

మోడీ సభను అడ్డుకుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పాలన ఉండదని, బెంగాల్ సీఎం మమతా కంటే దారుణమైన పరాభవం చంద్రబాబుకి తప్పదని బీజేపీ ఎంపీ జీవిఎల్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సభకోసం జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకివ్వడం లేదని, ప్రధాని సభకు వెళ్లేందుకు మాట్లాడుకున్న ప్రైవేటు వాహనాలను సీజ్‌ చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చకుండా ఇవాళ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారో ముందు సమాధానం చెప్పాలంటూ టీడీపీ, వామపక్షాలు, విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద మోడీ టూర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle