newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

మోడీ అభయం.. హోదా సాధ్యమేనా?

10-06-201910-06-2019 08:40:01 IST
Updated On 24-06-2019 13:12:24 ISTUpdated On 24-06-20192019-06-10T03:10:01.178Z10-06-2019 2019-06-10T03:09:50.349Z - 2019-06-24T07:42:24.633Z - 24-06-2019

మోడీ అభయం.. హోదా సాధ్యమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుపతి రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన ‘ప్రజా ధన్యవాద సభ’లో ప్రధాని మోడీ ప్రసంగించారు. తిరుమల వేంకటేశ్వరుడి సాక్షిగా ప్రధాని మోడీ ఏపీకి అభయం ఇచ్చారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తిరుపతి వచ్చారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీకి అఖండ విజయం చేకూర్చిపెట్టిన కార్యకర్తల కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. 

‘‘ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి.కొందరు ఈ ఫలితాల తరువాత బయటకు రావడానికి జంకుతున్నారు. బీజేపీ భారత్ అజేయశక్తిగా ఎదిగింది.  ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలు పెరిగాయి. మోదీ ఏం చేస్తారో? అని అనేకమంది ఆలోచిస్తున్నారు. సంకల్ప సిద్ధితో పనిచేస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవచ్చు. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం.ఇప్పుడు కేవలం దేశంలోని 130 కోట్ల మంది భారతీయులకు సంక్షేమ ఫలాలను అందించడంపైనే దృష్టి సారించాం’’అన్నారు మోడీ. 

అంతకుముందు ప్రధాని మోడీకి తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహన్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, చిత్తూరు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఈ తర్వాత అక్కడికి దగ్గర్లోనే భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేణిగుంట విమానాశ్రయంవద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం జగన్‌ రెండు సార్లు ప్రధాని కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించారు. అయితే మోడీ వారించారు.ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ కు మోడీ అభినందనలు తెలిపారు. మోడీ సభ సాక్షిగా టీడీపీపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఈ ఎన్నికల్లో ఆయనను ప్రజలు తిరస్కరించారన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలపై గతంలో హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాథ్‌సింగ్‌ తగిన చర్యలు చేపట్టారు. ఇప్పుడు అమిత్‌ షా సైతం ఆంధ్ర ప్రజలకు తగిన న్యాయం చేస్తారన్నారు. మోడీ పర్యటన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అయితే హోదాపై మాత్రం మోడీ నోరుమెదపలేదు. మరి ఏపీకి ఎలా న్యాయం చేస్తారో చూడాలి. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle