facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
*పుల్వామా అమర జవాన్లకు చంద్రబాబు సాయం... ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా * పుల్వామా ఘటనపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం....తీవ్రవాదులపై చర్యలకు పూర్తి మద్దతు.. ఒక దేశం ఒకటే మాట * కోమటిరెడ్డి, సంపత్ కేసు.... న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులకు జ్యుడీషి‌యల్‌ కస్టడీ.. 10వేల పూచీకత్తుపై విడుదల *పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్.. ఉగ్రవాద చర్యలు ఆపాలని, వారి ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరికలు* ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా *టీటీడీ బోర్డు సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు.. టీఆర్ఎస్‌లో చేరే అవకాశం * ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణలో 33 జిల్లాలు.. అందుబాటులోకి నారాయణపేట, ములుగు జిల్లాలు * భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’‌ సాంకేతిక అడ్డంకులు.. ప్రారంభించిన మరుసటి రోజే ఆగిపోయిన రైలు

మోడీతో బాబు ఢీ: ఢిల్లీలో ‘ధర్మపోరాట దీక్ష’

11-02-201911-02-2019 11:16:00 IST
Updated On 11-02-2019 12:55:53 ISTUpdated On 11-02-20192019-02-11T05:46:00.248Z11-02-2019 2019-02-11T05:45:42.607Z - 2019-02-11T07:25:53.584Z - 11-02-2019

మోడీతో బాబు ఢీ: ఢిల్లీలో ‘ధర్మపోరాట దీక్ష’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాటదీక్షకు దిగారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్ విషయంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీ ఆవేదనను దేశప్రజల దృష్టికి తెస్తున్నామని చంద్రబాబునాయుడు చెప్పారు. ఇందుకోసం ఏపీ భవన్ ప్రాంగణంలో భారీస్థాయిలో వేదిక ఏర్పాటు చేశారు. ఏపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు భారీస్థాయిలో ఈ దీక్షలో పాల్గొనేందుకు ఢిల్లీ తరలివచ్చారు. 

విభజన చట్టంలోని అంశాలను కేంద్రప్రభుత్వం నెరవేర్చలేదని, విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి జరిగిన అన్యాయం కోసమే తాము పోరాడుతున్నామని, కేంద్రం భిక్ష కోసం కాదని చెప్పారు. ‘‘మూడు రోజుల సమయం ఇస్తున్నా. పార్లమెంట్‌ వేదికగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఏపీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

హోదా ఇస్తేనే ఏపీ కోలుకుంటుందని విభజన సమయంలో చెప్పారన్నారు. ఏపీ పట్ల మోడీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. పదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వాలని జైట్లీ అప్పుడు అన్నారని, పదేళ్లు హోదా అడిగిన మీరు ఇప్పుడు మాట నిలబెట్టుకోలేదని బీజేపీపై ఫైరయ్యారు. రెవెన్యూ లోటు కూడా తీర్చలేదని.. నిధులు లేక ఏపీ ఇబ్బందులు పడుతోందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని.. ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. 

ధర్మాన్ని కాపాడాలని గతంలో వాజ్‌పేయ్...మోడీకి చెప్పారని, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు పోరాటం ఒక్కటే శరణ్యమన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండాపోయిందన్నారు. ఏపీకి న్యాయం చేయమని అడిగితే వ్యక్తిగత విమర్శలకు దిగారన్నారు. ఏపీ ప్రజల సత్తా ఏంటో చూపించడానికే ఢిల్లీకి వచ్చామన్నారు చంద్రబాబు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తగిన విధంగా బుద్ధిచెబుతామని చంద్రబాబు హెచ్చరించారు. గతంలో తెలుగు ప్రజలతో పెట్టుకున్న ఏ నేతకు భవిష్యత్తు లేదని నిరూపణ అయిందని, ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందన్నారు. హామీలు నెరవేర్చని మోడీకి పాలించే అర్హత ఎక్కడ ఉందన్నారు. ఏపీ పట్ల వ్యవహరించిన తీరుకి పార్లమెంట్ సాక్షిగా క్షమాపణలు చెప్పి, విభజన చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఒక పక్క దీక్ష జరుగుతుంటే పార్లమెంటు ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులు, నల్లదుస్తులతో టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు.చంద్రబాబుకు మహా కూటమి నేతలు అనేకమంది సంఘీభావం తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా ధర్మపోరాట దీక్షకు వచ్చారు. 

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle