newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

మోడీతో జగన్ వంద నిమిషాలు.. మురిసిపోతున్న వైసీపీ!

14-02-202014-02-2020 12:39:32 IST
Updated On 14-02-2020 13:22:53 ISTUpdated On 14-02-20202020-02-14T07:09:32.108Z14-02-2020 2020-02-14T07:09:29.501Z - 2020-02-14T07:52:53.999Z - 14-02-2020

మోడీతో జగన్ వంద నిమిషాలు.. మురిసిపోతున్న వైసీపీ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు వంద నిమిషాల పాటు భేటీ అయ్యారు. కాదు.. ప్రధాని మోడీ సీఎం జగన్ కు వంద నిమిషాల సమయం కేటాయించారు. అంటే సీఎం జగన్ కు మోడీ అంత విలువ ఇస్తున్నారన్నట్లుగా గత రెండు రోజులుగా వైసీపీ తెగ ప్రచారం చేసుకుంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశ ప్రధాని సమయం ఇవ్వడంలో ఇంత సంతృప్తి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

నిజానికి కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డికి కేంద్రం వద్ద అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కడం లేదని ప్రచారం జరుగుతూ వస్తుంది. ఒకటి రెండుసార్లు జగన్ ఢిల్లీకి వెళ్లినా అక్కడ ప్రధాని, మంత్రుల అపాయింట్మెంట్ కూడా లభించక వెనక్కు వచ్చేశారన్న కథనాలు కూడా కనిపించాయి. ఈక్రమంలో ఒక్కసారిగా ఒకటిన్నర గంట సేపు ప్రధాని సమయం కేటాయించడం వైసీపీ శ్రేణులకు ఆనందం కలిగిస్తుంది.

అయితే, భేటీ జరిగిన గంటన్నర సమయంలో రాష్ట్రానికి జరిగిన అదనపు ఆదాయం ఏంటన్నది మాత్రం ఆ పార్టీ శ్రేణులు చెప్పుకోలేకపోవడం విశేషం. ఈ భేటీలో రాజధాని తరలింపు, పీపీఏలు, కియా మోటార్స్ రాయతీలు వంటి వాటిపై సమీక్షలు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చర్చకు వచ్చినట్లుగా ఓ మీడియా వర్గం వెల్లడించగా మరో వర్గం రాష్ట్రంలో జరిగే ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రధానిని ఆహ్వానించారని చెప్పుకొచ్చింది.

ప్రధాని, సీఎం మధ్య ఏం జరిగిందన్నదానిపై రకరకాల కథనాలు ఉన్నా ప్రధాని సీఎం జగన్ కు అంత సమయం కేటాయించడంపై మాత్రం రాజకీయ మేధావులు రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. అందులో ప్రముఖంగా వినిపిస్తుంది మాత్రం వైసీపీని ఎన్డీఏలో చేరాల్సిందిగా బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లుగా.. అందుకు నిన్న భేటీలో చర్చలు జరిగినట్లుగా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతానికి కేంద్రానికి మిత్రపక్షంగానే ప్రతి బిల్లును సమర్థిస్తున్న వైసీపీకి వచ్చే రెండేళ్లలో రాజ్యసభలో పది మంది ఎంపీలు రానున్నారు. ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ సంఖ్యాబలం తగ్గుతుంది. ఈక్రమంలోనే వైసీపీని ఎన్డీయేలో చేరేందుకు దారులు తెరిచినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనికి విజయసాయి రెడ్డి లాంటి వారు ఢిల్లీలో కర్త, కర్మ, క్రియలై నడిపిస్తున్నట్లుగా తెలుస్తుంది.

అన్నీ అనుకున్నట్లే జరిగితే విజయసాయి రెడ్డి కేంద్ర క్యాబినెట్ లో స్థానం దక్కించుకోనున్నట్లుగా కూడా అటు సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాలలో కూడా ప్రచారం జరుగుతుంది. కాగా, బుధవారం ప్రధానితో సీఎం జగన్ భేటీలో దాదాపుగా రాజకీయ పరమైన చర్చలే తప్ప రాష్ట్రానికి ప్రయోజనకరమైన అజెండాలు ఎంతమాత్రం లేవని కొట్టిపారేస్తున్నారు. అందునా కేంద్రం ఏపీకి అదనపు ఆదాయం చేకూర్చే పరిస్థితులు కూడా అసలే లేవంటున్నారు.

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   6 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   10 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   10 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   13 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   16 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   16 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   16 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   17 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   19 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle