newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

మోడీకి పవన్ కళ్యాణ్ రిపోర్టు వయా బాబు

27-01-201927-01-2019 13:03:30 IST
Updated On 27-01-2019 20:53:14 ISTUpdated On 27-01-20192019-01-27T07:33:30.815Z27-01-2019 2019-01-27T07:33:20.187Z - 2019-01-27T15:23:14.693Z - 27-01-2019

మోడీకి పవన్ కళ్యాణ్ రిపోర్టు వయా బాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని, ప్రత్యక హోదా ఇవ్వలేదని, నిధులను మంజూరు చేయడం లేదని దీక్షలు చేపట్టిన తెలుగుదేశం ఇప్పుడు తమ నాయకుడు చంద్రబాబుతో ఏకంగా ఢిల్లీలోనే దీక్ష చేయించాలని భావిస్తున్న విషయం తెలిసిందే ! అదలా ఉంచితే.. ఇప్పుడు బాబు మనసులో కొత్త ఆలోచన మెరిసింది. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత సొమ్ము ఇవ్వాలన్న విషయంపైనా కొంతకాలం క్రితం జనసేన అధక్షుడు పవన్ కళ్యాణ్ కొంతమంది మేధావులు, నిపుణులతో కలిసి ఒక జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీని వేసిన విషయం తెలిసిందే. వాళ్లంతా మల్లగుల్లాలు పడి నివేదికలు తయారుచేశారు. 

ఒక స్థూలమైన నివేదికను లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ విడుదల చేస్తే..మరో నివేదికను పీకే విడుదలచేశారు. ఇప్పుడా నివేదికల కాపీల్ని ఢిల్లీలో విస్తృతంగా పంపిణీ చేసి ప్రచారం చేయాలంటూ చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు వచ్చే పార్లమెంటు సమావేశాల్ని ఉపయోగించుకోవాలన్నది ఆయన అభిమతం. అదే  సమయంలో దీక్ష కూడా చేపడితే ఎఫెక్టివ్‌గా ఉంటుందనేది ఆయన అభిప్రాయం. 

ఇవన్నీ సరే.. కేంద్ర సహాయంపైనా  తాను నలుగురు పెద్ద మనుషుల్ని..వీలైతే అన్ని రాజకీయ పక్షాల్ని చేరదీసి ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి తయారు చేయాల్సిన పనిని ఒక విపక్ష పార్టీ తయారు చేస్తే దాన్ని తాను పంపిణీ చేయడమేంటన్న ఆలోచన ఆయనకు ఎందుకు రాలేదంటూ ఒక రాజకీయ పక్ష నాయకుడు ఎద్దేవా చేశారు. ఇటీవల శ్వేతా పత్రాల విడుదల పేరుతో బాబు చేసిన హడావుడి ప్రజల్లో ఏపాటి చైతన్యం తీసుకుని వచ్చిందో తెలియదు కానీ రేపటి రోజున విపక్షాలు చేసిన పనిని తాను ప్రచారం చేయడమే విడ్డూరంగా ఉంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle