newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

మొన్న పాల్ గొలుసు.. నిన్న షర్మిల ఉంగరం

01-04-201901-04-2019 09:30:14 IST
Updated On 01-04-2019 09:30:41 ISTUpdated On 01-04-20192019-04-01T04:00:14.401Z01-04-2019 2019-04-01T04:00:08.617Z - 2019-04-01T04:00:41.897Z - 01-04-2019

మొన్న పాల్ గొలుసు.. నిన్న షర్మిల ఉంగరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకులు ముమ్మరం ప్రచారం చేస్తున్నారు.  ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోతున్నారు. సమావేశాలకు హాజరవుతున్న వారి వస్తువులను, డబ్బులను ఏదోవిధంగా కొట్టేస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సోదరి షర్మిల గుంటూరు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, అందరూ చూస్తుండగానే ఆమె చేతి ఉంగరాన్ని చోరీ చేసేందుకు యత్నించాడో దొంగ. 

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల.. రోడ్‌ షోలతో బిజీ అయ్యారు. పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు షర్మిలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. కార్యకర్తల ఉత్సాహం చూసి ఆమె బస్సులో నుంచే చేయి అందించారు. ఇదే అదనుగా ఓ వ్యక్తి షర్మిల చేతికి ఉన్న ఉంగరాన్ని కొట్టేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన షర్మిల.. తన చేతిని వెనక్కు లాక్కున్నారు. ఉంగరం కాస్త బిగుతుగా ఉండటంతో వేలు నుంచి రాలేదు. అంతకుముందు ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్ గొలుసు చోరీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ నేతలు, కార్యకర్తలు, సభలకు హాజరయ్యే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Image result for ka paul gold chain robbery


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle