newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

మొన్న కేశినేని.. ఇవాళ దివాకర్... సైకిల్ నేతలకు అచ్చిరాని ట్రావెల్స్!

16-11-201916-11-2019 09:01:51 IST
Updated On 16-11-2019 12:16:33 ISTUpdated On 16-11-20192019-11-16T03:31:51.644Z16-11-2019 2019-11-16T03:31:40.046Z - 2019-11-16T06:46:33.382Z - 16-11-2019

మొన్న కేశినేని.. ఇవాళ దివాకర్...  సైకిల్ నేతలకు అచ్చిరాని ట్రావెల్స్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ నేతలకు ట్రావెల్స్ బిజినెస్ అచ్చిరావడం లేదా?

మొన్న బెజవాడ ఎంపీ కేశినేని ...

ఇప్పుడు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

రవాణాశాఖ తనిఖీలే జేసీకి చికాకు తెప్పిస్తున్నాయా?

దివాకర్ ట్రావెల్స్ తాత్కాలికంగా మూతపడుతుందా?

ఇంతకుముందు టీడీపీ నేత, బెజవాడ ఎంపీ కేశినేని నాని తన ట్రావెల్స్ బిజినెస్ మూసేశారు. తాజాగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వంతు వచ్చినట్టుంది. నిత్యం తనిఖీలు, కేసుల గొడవతో జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దివాకర్ ట్రావెల్స్ బిజినెస్‌ను కొంతకాలం పాటు మానేస్తున్నట్లు ప్రకటించారు. అందుకే దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఇంట్లోనే పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు జేసీ.

చీటికీమాటికీ రవాణా శాఖ అధికారులు దివాకర్ ట్రావెల్స్ బస్సులు, లారీలను టార్గెట్ చేస్తున్నారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు జేసీ. అలాగని బిజినెస్ పూర్తిగా మానేయడం లేదని.. ఇది తాత్కాలికం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు జేసీ.

తనపై సీఎం జగన్‌ ప్రతీకార వాంఛతో వున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సున్నితంగా హెచ్చరించారు దివాకర్ రెడ్డి. 

దివాకర్ ట్రావెల్స్‌తో పాటు ఇతర ఆస్తుల విషయంలో తనపై ఒత్తిళ్లు తెస్తున్నారని మాజీ ఎంపీ ఆరోపించారు. అంతేకాదు అధికారుల దాడుల వెనుక నేతల హస్తం ఉందంటున్నారు జేసీ. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే.. జగన్ ఇప్పటికీ తమవాడేనంటూ కామెంట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.

టీడీపీలో ఉంటే ఉపయోగం లేదనే భావనలోనే కొంతమంది టీడీపీ నాయకులు బయటకు వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. దివాకర్ ట్రావెల్స్ మూసివేత నిర్ణయంపై పలు కామెంట్లు వినిపిస్తున్నాయి.

సైకిల్ పార్టీ నేతలకు ట్రావెల్స్ బిజినెస్ అచ్చిరావడం లేదని, ఏదో ఒక ఆటంకం కలుగుతోందని రాజకీయనేతలు అంటున్నారు. మరి ఎన్నాళ్ళు 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle