newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

మేధావులూ... ఏందీ ర‌చ్చ‌..?

30-04-201930-04-2019 08:16:50 IST
Updated On 03-07-2019 13:39:28 ISTUpdated On 03-07-20192019-04-30T02:46:50.183Z30-04-2019 2019-04-30T02:46:35.361Z - 2019-07-03T08:09:28.635Z - 03-07-2019

మేధావులూ... ఏందీ ర‌చ్చ‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విద్యావంతులు రాజ‌కీయాల్లోకి రావాల‌ని త‌ర‌చూ పిలుపులు వినిపిస్తుంటాయి. చ‌దువుకున్న వారు రాజ‌కీయాల్లోకి వ‌స్తే విలువ‌లు పెరుగుతాయ‌ని, ప్ర‌జ‌ల‌కు కొంచెం మంచి జ‌రుగుతుంద‌నేది ఈ పిలుపుల అర్థం. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లోకి ఆల‌స్యంగా ఎంట‌రైన‌ ఇద్ద‌రు ఉన్నత విద్యావంతులు విలువ‌లు పెంచ‌క‌పోగా ఉన్న విలువ‌లు సైతం దిగ‌జార్చేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతూ రోజురోజుకూ వారికున్న ఇమేజ్‌ను దిగ‌జార్చుకోవ‌డంతో పాటు రాజ‌కీయాలంటేనే వెగ‌టు పుట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వైఎస్ కుటుంబానికి ఆడిట‌ర్‌గా, అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా ముద్ర‌ప‌డ్డ విజ‌య‌సాయిరెడ్డి ఐదేళ్ల నుంచే రాజ‌కీయ తెర‌పై క‌నిపిస్తున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వైసీపీ కీల‌క నేత‌ల్లో ఒక‌రిగా ఎదిగారు. ఇక‌, ఆర్థిక నిపుణులుగా గుర్తింపు పొందిన కుటుంబ‌రావు గ‌త ఐదేళ్లుగా ఏపీ ప్ర‌భుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీలో కీల‌కంగా ప‌నిచేస్తున్నారు. ఏపీ ప్లానింగ్ క‌మిష‌న్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయ‌న ఉన్నారు.

వీరిద్ద‌రూ త‌మ‌త‌మ పార్టీల త‌ర‌పున బ‌లంగా మాట్లాడే వ్య‌క్తులుగా ముద్ర‌ప‌డ్డారు. అయితే, ఇప్పుడు వీరిద్ద‌రి మధ్య వార్ న‌డుస్తోంది. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు స‌హ‌జం. విద్యావంతులుగా ఉన్న వీరిద్ద‌రి మ‌ధ్య విమ‌ర్శ‌లు హుందాగా ఉండాలి. ఏదైనా విష‌యంపై చ‌ర్చ జ‌ర‌గాలి. కానీ, అలా జ‌ర‌గ‌డం లేదు. ఒక‌రు ట్విట్ట‌ర్ వేదిక‌గా, మ‌రొక‌రు మీడియా ముందుకొచ్చి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు.

ఒక‌రిని బ్రోక‌ర్ అని తిడుతుంటే, మ‌రొక‌రు దొంగ ఆడిట‌ర్ అని తిడుతున్నారు. ఒక‌రిని పిచ్చి కుక్క అని సంభోదిస్తుంటే మ‌రొక‌రికి వైర‌స్ సోకింద‌ని ర‌క‌ర‌కాలుగా దుర్భాష‌లాడుకుంటున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య ప్ర‌స్తుతం మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక వ్య‌వ‌స్థ దిగ‌జార్చార‌ని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శిస్తున్నారు. ద‌మ్ముంటే ఆర్థిక ప‌రిస్థితిపై చ‌ర్చ‌కు రావాల‌ని కుటుంబ‌రావు స‌వాల్ చేస్తున్నారు.

అయితే, ఇద్ద‌రూ చ‌దువుకున్న వారు కాబ‌ట్టి, ఇద్ద‌రూ ఆర్థిక వ్య‌వ‌హారాల్లో నిపుణులు కాబ‌ట్టి రాష్ట్ర అర్థిక ప‌రిస్థితిపై చ‌ర్చ చేస్తే నిజానిజాలు ప్ర‌జ‌లకు తెలుస్తాయి. అంతేకానీ ప్ర‌తీరోజు మీడియాలో, ఒక‌రు సోష‌ల్ మీడియాలో ఒక‌రు ఇలా తిట్టుకోవ‌డం ఏంట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. చ‌దువుకున్న వారిగా రాజ‌కీయాల్లో విలువ‌లు పెంచ‌కున్నా క‌నీసం త‌గ్గించ‌కండ‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle