newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

మేడిన్ అంధ్రా కారు.. ఎవ‌రి ఘ‌న‌త‌..?

09-08-201909-08-2019 09:11:36 IST
2019-08-09T03:41:36.923Z09-08-2019 2019-08-09T03:34:49.201Z - - 26-08-2019

మేడిన్ అంధ్రా కారు.. ఎవ‌రి ఘ‌న‌త‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మ‌రోసారి వార్ న‌డుస్తోంది. కియా ప‌రిశ్ర‌మ క్రెడిట్ ఎవ‌రికి త‌మ‌కంటే త‌మ‌కే అంటూ రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం బ‌య‌ట‌, సోష‌ల్ మీడియా వేదిక‌గా న‌డుస్తోంది. అనంత‌పురంలోని కియా పరిశ్ర‌మ‌లో త‌యారుచేసిన మొద‌టి కారు ప్రారంభోత్సవం సంద‌ర్భంగా రెండు పార్టీలూ మ‌రోసారి త‌ల‌ప‌డుతున్నాయి. 

అనంత‌పురం జిల్లా పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ హ‌యాంలో 13 వేల కోట్లతో ద‌క్షిణ కొరియాకు సంబంధించిన కియా సంస్థ ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేసింది. టీడీపీ హ‌యాంలో తీసుకువ‌చ్చిన పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఆ పార్టీ మొద‌ట చెప్పుకునేది కియా గురించే. ఎన్నిక‌ల వేళ కూడా ఇది ఒక ప్ర‌చారాస్త్రంగా టీడీపీ మార్చుకుంది. ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల ముందు ఓ కారును విడుద‌ల చేశారు.

అయితే, కియా టీడీపీకి ఎన్నిక‌ల్లో పెద్ద‌గా క‌లిసి రాలేదు. అనంత‌పురం జిల్లాలో కేవ‌లం రెండు సీట్లే గెలిచిన ఆ పార్టీ కియా ప‌రిశ్ర‌మ ఏర్పాటైన పెనుగొండ‌లోనూ ఓడిపోయింది. ఇటీవ‌ల అసెంబ్లీలో చ‌ర్చ సంద‌ర్భంగా కియా సంస్థ క్రెడిట్ ఎవ‌రిద‌నే వాద‌న రెండు పార్టీల మ‌ధ్య మొద‌లైంది. 2007లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విన‌తి వ‌ల్లే కియా స్థాపించిన‌ట్లు ఆ సంస్థ సీఈఓ రాసిన ఓ లేఖ‌ను ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి చ‌దివి వినిపించారు.

అప్పుడే కియాపై రెండు పార్టీల మ‌ధ్య వాద‌న జ‌రిగింది. ఇక‌, ఇప్పుడు కియా నుంచి తొలి కారు సెల్టోస్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఆహ్వానించినా ఆయ‌న హాజ‌రుకాలేదు. మంత్రులు బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి, శంక‌ర్‌నారాయ‌ణ‌, రోజా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కూడా వైఎస్ విన‌తి వ‌ల్లే కియా స్థాపించార‌ని బుగ్గ‌న మ‌రోసారి చెప్పారు.

కానీ, కియా మొద‌టి కారు విడుద‌ల సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసుకుంది. నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో చంద్ర‌బాబు వ‌ల్లే కియా వ‌చ్చింద‌ని వ‌రుస ట్వీట్లు చేస్తున్నారు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు. #ThankYouCBNForKIA హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేసింది. చంద్ర‌బాబు నాయుడు సైతం కియా కారు విడుద‌ల సంద‌ర్భంగా సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఓ వైపు మొద‌టి రోజు ఆరు వేల బుకింగ్స్ సాధించిన కియా సంస్థ సంతోషంగా ఉంటే వైసీపీ, టీడీపీ మాత్రం మ‌రోసారి క్రెడిట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాయి. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle