newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

మేఘాకు అంత వీజీ కాదు..కాళేశ్వరం..పోలవరం ఒకటేనా?

02-11-201902-11-2019 16:58:09 IST
2019-11-02T11:28:09.088Z02-11-2019 2019-11-02T11:14:29.900Z - - 14-11-2019

మేఘాకు అంత వీజీ కాదు..కాళేశ్వరం..పోలవరం ఒకటేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎట్టకేలకు ఆరునెలల విరామం తర్వాత పోలవరం బారీ సాగునీటి ప్రాజెక్టు పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పోలవరం పనులు మొదలుపెట్టవచ్చంటూ రాష్ట్ర హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తగా కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ లిమిటెడ్ శుక్రవారం లాంచనంగా పనులు ప్రారంభించింది. రూ. 4,987 కోట్ల విలువైన పోలవరం ప్రాజెక్టు పనులను 800 కోట్ల రూపాయల తక్కువ కోట్‌తో దక్కించుకున్న మేఘా సంస్థ శుక్రవారం మధ్యాహ్నం భూమి పూజ చేసిన తర్వాత లాంచనంగా పనులు ప్రారంభించింది. 

పోలవరం వంటి భారీ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి తగిన సాంకేతిక అనుభవం  మేఘా సంస్థకు పుష్కలంగా ఉందనడంలో సందేహమే లేదు. కానీ 2011 జూన్‌లో ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువులోగా మేఘా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయగలదా అనేదానిపైనే సందేహాలు నెలకొంటున్నాయి. ఏ కారణాల వల్ల అయినా  నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే, రైతులు వ్యవసాయ సీజన్‌లో నాలుగు వేలకోట్ల రూపాయల పంటను నష్టపోకతప్పదు.

అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో ఆదా చేశానని చెబుతున్న మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. పైగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ ప్రాతిపదికన కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. కాబట్టి ప్రతిపాదిత బడ్జెట్‌లోనే సంస్థ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరాల్సి ఉంది. ఏ కారణం వల్ల అయినా ఆలస్యం జరిగితే పెరిగిన ఖర్చులను చెల్లించాలని డిమాండ్ చేసే హక్కు సంస్థకు ఉండదు.

భూమి పూజ జరుగుతున్న సమయంలోనే నెలల తరబడి వేతనాలకు దూరమైన కార్మికులు తమ వేతనాలు చెల్లించాలని భూమి పూజ జరుగుతున్నచోటే ధర్నా చేపట్టారు. పోలీసులు ఆందోళన చేస్తున్న కార్మికులను అక్కడి నుంచి తరలించారు.

2014 నుంచి 2017 మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదని సాగునీటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. గత రెండేళ్లలో స్పిల్ వే మాత్రమే పూర్తి చేసిన టీడీపీ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టును పూర్తి చేసినట్లు పచ్చి అబద్దాలు చెప్పిందని మంత్రి ఆరోపించారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle