newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

మేం తెగిస్తే మీరు తట్టుకోలేరు.. పవన్ వార్నింగ్

14-01-202014-01-2020 17:33:54 IST
2020-01-14T12:03:54.539Z14-01-2020 2020-01-14T12:03:49.904Z - - 18-01-2020

మేం తెగిస్తే మీరు తట్టుకోలేరు.. పవన్ వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటించారు. పవన్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిని ఆయన ఎండగట్టారు. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేశారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన జనసేన నాయకులు పంతం నానాజీ, ఇతర కార్యకర్తలను పరామర్శించారు పవన్.

అకారణంగా లేని గొడవను సృష్టించారని పవన్ మండిపడ్డారు. మేం ప్రజాసమస్యలపై దృష్టిసారించి ముందుకెళుతున్నామన్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉన్నారంటే సిగ్గుగా ఉందన్నారు. వారి భాష చాలా అభ్యంతకరంగా ఉందన్నారు. కారణం లేకుండా తమపై దాడికి దిగితే పోలీసులు పట్టించుకోలేదన్నారు. నిరసనలు తెలిపే హక్కు తమకు ఉందన్న పవన్. పోలీసు ఉన్నతాధికారులకు ఈ విషయం తెలుపుతామన్నారు.

పోలీసులు సుమోటాగా స్వీకరించి ఎమ్మెల్యేపై కేసు పెట్టాలన్నారు. జనసేన కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై పవన్ మండిపడ్డారు. మా సహనాన్ని చేతగానితనంగా చూడవద్దన్నారు పవన్. తాము శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే మీరెవరూ ఉండలేరన్నారు. ఆడపడుచులపట్ల వాడిన భాష బాధను కలిగించిందన్నారు. 

ఇదిలా ఉంటే.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని పలు ప్రధాన కేంద్రాల్లో పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ద్వారంపూడి నివాసానికి 100 మీటర్ల దూరంలో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నపవన్ విశాఖపట్నం నుండి కాకినాడకు పయనమయ్యారు.

హోటల్ దగ్గర పవన్ అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడకు బయల్దేరిన పవన్‌‌ను కాన్వాయ్‌ని తుని దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పవన్‌ పర్యటనను అడ్డుకోబోమని, అరెస్ట్‌ కూడా చేయమని ఎస్పీ నయీం హస్మీ స్పష్టం చేసినా పరిస్థితి మారలేదు. 

మాట తప్పి పవన్ కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీలో జాతీయస్థాయి నేతలతో అమరావతి రైతుల గోడు వెల్లడించానన్నారు పవన్. కేంద్రం స్పందిస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు. 

 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   6 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   6 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   8 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   8 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   9 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   9 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   9 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   10 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   10 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle