newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

‘‘మేం జూనియర్లం కాదు.. కింగ్ మేకర్లం అవుతాం’’

30-10-201930-10-2019 14:55:21 IST
Updated On 30-10-2019 15:02:10 ISTUpdated On 30-10-20192019-10-30T09:25:21.185Z30-10-2019 2019-10-30T09:18:57.226Z - 2019-10-30T09:32:10.738Z - 30-10-2019

‘‘మేం జూనియర్లం కాదు.. కింగ్ మేకర్లం అవుతాం’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో బీజేపీ నేతలు పార్టీ పటిష్టానికి పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళుతున్నారు. జాతీయ స్థాయి నేతలు ఏపీలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు. గాంధీ సంకల్పయాత్రలతో 13 జిల్లాలను చుట్టేస్తున్నారు. తాజాగా రాంమాధవ్ ఏపీలో పర్యటించారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

జగన్ సీఎం అయ్యాక నాలుగు నెలల కాలంలో ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు రాంమాధవ్.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా చేసిందని, గతంలో టీడీపీ, ఇపుడు వైసీపీ కూడా కేంద్ర పధకాలను తమ పధకాలుగా చెబుతోందని మండిపడ్డారు. లబ్ధిదారుల ఎంపిక వైసీపీ కార్యకర్తలకు కమిటీల ద్వారా చేయటం సరికాదన్నారు. ఏపీలో టీడీపీని వదిలి చాలా మంది తయ పార్టీలో చేరుతున్నారని, అందుకే చంద్రబాబు దిగులుపడుతున్నారన్నారు. బీజేపీతో పొత్తు వదిలి తప్పుచేశానని చంద్రబాబు బాధ పడుతున్నారని తాను భావిస్తున్నానని రాంమాధవ్ అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో తాము స్వతంత్రంగా ముందుకెళతామన్నారు. ఎవరితో పొత్తు లేకుండా పార్టీ ని అభివృద్ధి చేసేందుకు తామంతా పనిచేస్తున్నామన్నారు. బీజేపీ రానున్న రోజుల్లో  ఏపీలో నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి బీజేపీ జూనియర్ పార్టీ గా వ్యవహరించదన్నారు. విజయవాడ సింగ్ నగర్ లో బీజేపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇటు ఒంగోలులో గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. గాంధీ రోడ్డులో గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. భోరున వర్షం పడుతున్న సంకల్ప యాత్రలో అధికసంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంటల బీమా విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి రైతులకు న్యాయం చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. 

Image may contain: 5 people

ఇటు, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి సైతం గాంధీ సంకల్పయాత్రలో చురుకుగా పాల్గొంటున్నారు. నకిలీ గాంధీలు 60 ఏళ్లు ఓటు రాజకీయాలతో దేశాన్ని పాలించారని విమర్శించారు సుజనా చౌదరి. మన సంస్కృతి, శక్తి సామర్ధ్యాలు ప్రపంచానికి చాటిన నేత ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు. 20 వ శతాబ్దంలో గాంధీ గారి గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తే, ఇప్పుడు మోడి గారిని శక్తివంతమైన నేతగా ప్రపంచం గుర్తించిందన్నారు. మొత్తం మీద బీజేపీ నేతలు ఎక్కువ కాలం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle