newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

‘మెడ్‌టెక్’ కథ తేల్చండి..ఏపీ సీఎస్‌కు ఇఎఎస్ శర్మ లేఖ

14-12-201814-12-2018 17:06:52 IST
Updated On 14-12-2018 17:06:44 ISTUpdated On 14-12-20182018-12-14T11:36:52.005Z14-12-2018 2018-12-14T11:36:44.700Z - 2018-12-14T11:36:44.703Z - 14-12-2018

‘మెడ్‌టెక్’ కథ తేల్చండి..ఏపీ సీఎస్‌కు ఇఎఎస్ శర్మ లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెడ్‌టెక్ జోన్ ఏర్పాటుపై కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఇఎఎస్‌ శర్మ పలు అనుమానాలు వ్యక్తంచేశారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం స్టీల్‌ప్లాంట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఏఎంటిజెడ్( ఆంధ్రా మెడికల్ టెక్నాలజీ జోన్ ) విషయంలో తగిన విచారణ జరపాల్సిందిగా ఇఏఎస్ శర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాకు లేఖ రాయడం అధికార వర్గాలలో సంచలనం కలిగిస్తోంది. ఏటా 17 శాతం వృద్ధితో 5 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న వైద్య పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ జోన్‌ కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. నేషనల్‌ మెడికల్‌ డివైస్‌ పాలసీలో భాగంగా విశాఖలో రెండేళ్ల క్రితం 270 ఎకరాలు కేటాయించింది. 30 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. మూడేళ్ళు గడచినా ఈ కేంద్రం పనితీరులో పురోగతి లేదనే ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. ఈ మెడ్‌టెక్ జోన్‌ని ఏపీ సీఎం చంద్రబాబునాయుుడు గురువారం (డిసెంబర్ 13న) జాతికి అంకితం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలో మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు చేశామని...270 ఎకరాల విస్తీర్ణంలో 20 వేల కోట్ల పెట్టుబడులతో 250 కంపెనీలు రాబోతున్నాయని గొప్పగా ప్రకటించారు. మెడ్‌టెక్ వ్యవహారాలపై అనేక సందేహాలను లేవనెత్తి వీటిపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇఎఎస్ శర్మ లేఖ రాయడంపై చర్చ జరుగుతోంది. 

గతంలో ల్యాంకోకు మౌలిక సదుపాయాల కల్పనకు ఇచ్చిన కాంట్రాక్టు లోపభూయిష్టంగా ఉందని శర్మ ప్రభుత్వ దృష్టికి తెచ్చిన కొద్ది కాలానికి కాంట్రాక్టును రద్దు చేసి బిఎస్‌సిపిఎల్ అనే సంస్థకు కాంట్రాక్టు ఇస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు సంస్థ మారినా మళ్ళీ అదే సీన్ రిపీటయింది. ఏదైనా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలంటే...ఆ సంస్థ అంతకుముందుగానే రిజిస్టర్ కావాలి కానీ ‘పవర్ మెక్ బీఎస్‌సీపీఎల్ కంపెనీ కన్సార్టియం ప్రైవేట్ లిమిటెడ్’ ఏర్పాటు కావడానికి రెండువారాల ముందే ఒప్పందం జరిగిపోయిందని ఇఎఎస్ శర్మ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మెడ్‌టెక్-పవర్ మెక్ బీఎస్‌సీపీఎల్ కంపెనీ కన్సార్టియం ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం డిసెంబర్ 6, 2017న జరిగిందని చెబుతున్నారు. కానీ ఈసంస్ధ (పవర్ మెక్ బీఎస్‌సీపీఎల్ కంపెనీ కన్సార్టియం ప్రైవేట్ లిమిటెడ్)  2017 డిసెంబర్ 20న ఏర్పాటైనట్టు ఏపీ మెడ్‌టెక్ యాన్యువుల్ రిపోర్ట్‌, పేజీ నెంబర్ 14లో ఉందని శర్మ అనుమానం వ్యక్తంచేశారు. 

ఏపీ సీఎస్‌కు రాసిన లేఖలో మెడ్‌టెక్ జోన్ ఆదాయ వ్యయాలపైన కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు శర్మ. మెడ్‌టెక్ జోన్ 2017-18లో ఆదాయం రూ. 39.96 లక్షలు అయితే ఇప్పటివరకూ అయిన ఖర్చులు రూ. 1.72 కోట్లు. ఈ వివరాలన్నీ కంపెనీ వార్షిక నివేదికలోనే పొందుపర్చారు. వార్షిక నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం 2017-18లో మెడ్‌టెక్ జోన్ నష్టం రూ. 1.42 కోట్లు కాగా, 2016-17లో వచ్చిన నష్టం రూ.48 లక్షలు. 5వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 4750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మెడ్‌టెక్ జోన్ గతంలో ప్రకటించింది. అయితే ఇంతవరకూ అతీగతీ లేదు. మెడ్‌టెక్ జోన్ కోసం ఆ సంస్థ ఎండీ జితేంద్ర శర్మ, వైద్యశాఖ అధికారులు అమెరికా, జర్మనీ, చైనా, సింగపూర్ దేశాలకు వెళ్ళి వచ్చారు. ఈ విదేశీ పర్యటనలకు ప్రభుత్వం 30లక్షలు పైనే ఖర్చు చేసింది.  గతంలో ఈ సంస్థ కార్యకలాపాలపై విపక్షాలు సైతం అభ్యంతరాలు తెలిపాయి. ధర్నాలు, ఆందోళనలు చేశాయి. ఈ ఆరోపణలను వైద్యశాఖ ఉన్నతాధికారులు కొట్టిపారేశారు. పర్యావరణ పరిరక్షణ, తుపానులు, వరదలు, అణువిద్యుత్ ప్లాంట్ వంటి అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే ఇఎఎస్‌ శర్మ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle