newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

మెగా ఫ్యామిలీ ప్రచారానికి దూరమేనా?

30-03-201930-03-2019 09:09:56 IST
Updated On 30-03-2019 13:39:54 ISTUpdated On 30-03-20192019-03-30T03:39:56.095Z30-03-2019 2019-03-30T03:39:51.518Z - 2019-03-30T08:09:54.678Z - 30-03-2019

మెగా ఫ్యామిలీ ప్రచారానికి దూరమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. చంద్రబాబు, జగన్, పవన్ సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలు జనసేన పార్టీకి కీలకంగా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తన సత్తా చాటాలని తపిస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు ఒక్కడిగానే పార్టీ స్థాపించి.. పార్టీ కార్యక్రమాలు అన్ని కూడా చూసుకుంటున్నాడు. మెగా క్యాంప్ సాయాన్ని అయితే ఇప్పటివరకు తీసుకోలేదు పవన్ కళ్యాణ్. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. కాసింత ప్రచారానికి అయినా మెగా హీరోలు వస్తారా అని ఆయన ఎదురుచూస్తున్నారు. అయితే పవన్‌‌కు నిరాశే కనిపిస్తోంది. 

నర్సాపురంలో నాగబాబు ఎంపీగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వేళ. అన్న వెనక పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించి.. చిరంజీవి తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి రాజకీయ సంచలనానికి తెర తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. చిరంజీవికి అంతగా అండగా నిలిచిన పవన్‌‌కు.. ఇప్పటివరకు మెగా క్యాంప్ నుంచి సాయం అందలేదు. అందే అవకాశం ఏ కోశాన కనిపించడం లేదు. 

ఎన్నికల ప్రచారం జోరందుకోవడం.. ముగియడానికి  పదిరోజుల సమయం ఉండడంతో.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల బట్టి మెగా హీరోలందరూ కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారని దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే. కనీసం నాగబాబు తరపున కుమారుడు హీరో వరుణ్ తేజ్ ప్రచారం చేస్తాడనుకుంటే.. ఆయన ప్రచారానికి దూరంగా ఉండనున్నాడు. వరుణ్ తేజ్ నటించనున్న సినిమా షూటింగ్ కోసం విదేశాలు వెళ్ళటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దీనికి కారణం చిరంజీవి సూచనలే అని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణనలోకి తీసుకుని చిరంజీవి.. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలంటూ మెగా హీరోలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఏమేరకు ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపుతారో వేచి చూడాల్సిందే. కనీసం 25 స్థానాలైనా తమకు రావాలని జనసేన నేతలు భావిస్తున్నారు. భీమవరం, గాజువాకల్లో రెండుచోట్ల పవన్ గెలుపు ఖాయమంటున్నారు. అయితే ఓటర్ల పల్స్ చూస్తే రెండంకెల స్థానాలు వచ్చే అవకాశాలు అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle