newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

మెగాస్టార్ చూపు.. బీజేపీ వైపు?

27-06-201927-06-2019 09:15:11 IST
Updated On 27-06-2019 11:17:56 ISTUpdated On 27-06-20192019-06-27T03:45:11.844Z27-06-2019 2019-06-27T03:45:05.440Z - 2019-06-27T05:47:56.583Z - 27-06-2019

మెగాస్టార్ చూపు.. బీజేపీ వైపు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజకీయ జీవితం స్తబ్ధుగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అంతగా ఆయన క్రియాశీలకంగా ఉండడంలేదు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ సీనియర్ నేతల కథనం ప్రకారం త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని చెబుతున్నారు. చిరంజీవి లాంటి వ్యక్తి బీజేపీలో చేరితే మేము సాదరంగా స్వాగతిస్తామని పేర్కొన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు. 

జులై 6 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుందని, అభిమానమున్న వారు పార్టీ సభ్యత్వంలో నమోదు చేసుకోవాలని కోరారు. చిరంజీవి బీజేపీలో చేరితే ఆయన మరో సోదరుడు నాగబాబు కూడా అదే బాటలో పయనించవచ్చని అంటున్నారు.

2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున నాగబాబు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి పోటీచేశారు. 2లక్షల వరకూ ఓట్లు సంపాదించారు. కానీ రాజకీయ భవిష్యత్తు లేకపోవడంతో అన్నయ్యతో కలిసి ప్లాన్ చేస్తున్నట్టు  తెలుస్తోంది. 

ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేశారు బీజేపీ నేతలు. బీజేపీ దూకుడు కారణంగా..ఏపీలో జనసేన, కాంగ్రెస్‌ పార్టీలలో కూడా ఒక కుదుపు రాబోతుందని అన్నారు.

2024 నాటికి దేశంలో చంద్రబాబు మినహా 150 మంది కీలక నేతలు కనుమరుగు కావచ్చు. అందుకే బీజేపీ నవ చైతన్యంతో ముందుకు దూసుకెళ్తుందని బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు అంటున్నారు. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా కూడా షూటింగ్ పూర్తయింది. త్వరలో చిరంజీవి ఒక నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle