newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

మూడేళ్ల మజిలీ.. తరువాత జమిలి..?

24-06-201924-06-2019 06:57:15 IST
2019-06-24T01:27:15.692Z23-06-2019 2019-06-23T16:48:15.670Z - - 28-05-2020

మూడేళ్ల మజిలీ.. తరువాత జమిలి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల్లో ఊహించని ఫలితాలు, నాయకుడు దేశంలో లేని వేళ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గోడ దూకి వైరి శిబిరంలోకి చేరిపోవడం.. వంటి వరుస విపరిణామాలతో నిర్ఘాంతపడి ఉన్న తెలుగుదేశం నేతలు కొద్దిగా తేరుకున్నట్టుగా కనిపిస్తున్నారు. లేచి నిలబడి ప్రత్యర్ధులపై ప్రతి విమర్శలకు దిగారు. ఐదేళ్లలో అంతులేని అవినీతి జరిగినట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, సహచర మంత్రులు తమపై చేస్తున్న వ్యాఖ్యలను వారు పదునైన వాగ్బాణాలతో తిప్పికొట్టారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ‘జమిలి’కి సిద్ధమవుతున్నట్టుగా వస్తున్న వార్తలు బహుశా వారికి సరికొత్త ప్రాణవాయువు అందించినట్టుగా భావించాలి. 

సహజంగానే ఏ రాజకీయ పార్టీకైనా ‘ఐదేళ్ల’ ఎదురుచూపులు ఎంతో కష్టతరమైన ప్రక్రియ. ఈ ఐదేళ్లూ అధికార పార్టీతో అనుక్షణం యుద్ధమే చేయాలి. ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రతి ఒక్క అంశాన్నీ ప్రశ్నించాలి. ప్రభుత్వ వైఫల్యాలను నిశితంగా గమనించి నిరంతరం వాటిని ఎత్తిచూపాలి. అనేక పోరాటాలు చేసి అందరి దృష్టిలో పడాలి.

రాజకీయ వేడి రాజేసి రకరకాల ఆందోళనలతో రాష్ట్రాన్ని అట్టుడికించాలి. ఇలాచేస్తేనే అధికార పక్షంపై ఏ ప్రతిపక్షమైనా విజయం సాధించేది. ఇదంతా ఎంతో కష్టమైన ప్రహసనం. తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో కాస్త మెరుగైన ట్రాక్ రికార్డే ఉంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ఆయన రాజకీయ వారసుడు చంద్రబాబు ‘అనేక యుద్ధముల ఆరితేరిన ఘనులు’. ఒక్క మాటలో చెప్పాలంటే అధికార పక్షంలో కంటే విపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ బాగా రాణిస్తుంది. ఎంతో క్రియాశీలకమైన, చైతన్యవంతమైన పాత్ర నిర్వర్తిస్తుంది. 

నిజానికి, ఐదేళ్ల పాటు ఇలా పోరాటాలు నడవాలంటే పార్టీకి అనేక వ్యయ ప్రయాసలు అనివార్యం. ‘ప్రయాస’ పడేందుకు పార్టీలోని అన్ని శ్రేణులూ సిద్దంగా ఉన్నా మరి ‘వ్యయం’ మాటేమిటి? అధికారానికి దూరమైన పార్టీకి ఈ ఆపద్కాలంలో ఆర్థికంగా ఆదుకుని తగిన ‘జవసత్వాలు’ కల్పించే బాధ్యతను ఎవరు తీసుకుంటారు? ‘పెట్టుబడిదారులు’ ఒక్కొక్కరూ ప్రత్యర్ధి శిబిరంలో చేరిపోతున్నారే? మరెలా? ఈ సందేహాలు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో ముప్పిరిగొంటున్నాయి. కాకపోతే, కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ఆది నుంచీ వెన్నుదన్నుగా ఉంటున్నారు. 

నాయకులు గోడదూకితే పార్టీ ఖాళీ అయిపోతుందని ఎవరైనా అనుకుంటే అది పొరబాటే అవుతుంది. అదే నిజమైతే, ఆ పార్టీ ఎప్పుడో అంతర్ధానమైపోయేది. గడచిన నాలుగు దశాబ్దాలలో ఆ పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. ఎంతటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొని కడిగిన ముత్యంలా ఆ పార్టీ మళ్లీ మెరుస్తూ నిలబడింది. తమిళనాట ద్రవిడ పార్టీని చూసి స్ఫూర్తిని పొందిన తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఆనాడే బలమైన కేడర్‌తో పార్టీకి చెక్కుచెదరని పునాదులు వేశారు. అందుకే ఏ ఆపద ఎదురైనా కార్యకర్తలే సైనికులై పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. 

ఇలావుంటే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కేంద్రంతో ఎలా మెలిగి ఎలాంటి సంబంధాలు నెరపుతుందనే దానిపైనే ఆ పార్టీ భవితవ్యం ఆధారపడి వుంటుందని పరిశీలకుల అంచనా. దేశాన్నంతా కాషాయజెండా నీడలోకి తీసుకువచ్చి ఏకఛత్రాధిపత్యంగా ఏలాలనేది కేంద్రంలో పాలకుల ఎజెండాగా అందరూ అర్థం చేసుకుంటున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకునేందుకు మోడీ-అమిత్ షా గడచిన ఐదేళ్లలో వేయని ఎత్తు లేదు. పన్నని రాజకీయ వ్యూహాలు లేవు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ను కూడా తమ ఏలుబడిలోకి తీసుకురావాలన్నది వారి గట్టి ప్రయత్నమన్నది అందరికీ తెలిసిన సంగతే. కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చారన్నట్టు మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడం వారికి కలిసొచ్చింది. 

అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ తమకు సామంతులుగా ఉంటారనడంలో సందేహమే లేదు. కాకపోతే, ఇక్కడ కూడా అధికారంలోకి రావాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకతప్పని పరిస్థితి. అదివ్వకుండా రాష్ట్రంలో ఆ పార్టీ కాలుబెట్టలేదన్నది మొన్నటి సార్వత్రిక ఎన్నికలు చాటిన సర్వజనీన సత్యం. పోటీ చేసిన ప్రతి చోటా ఆ పార్టీ అభ్యర్ధులు ‘నోటా’తో పోటీ పడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చి ఇక్కడ కూడా అధికార పీఠం ఎక్కేందుకు ప్రయత్నిస్తుందా?

లేక సామంతుల పాలన కొన్నేళ్లు కొనసాగిస్తుందా? అసలు బీజేపీ నేతల అంతరంగంలో ఏముందనేది కొన్నాళ్లు ఎదురు చూడాలి. ఐతే, జమిలి ఎన్నికలు వస్తే మూడేళ్లలోనే అందుకు సిద్ధం కావాలని వినవస్తున్న వార్తలు అనూహ్యంగా రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. మూడేళ్లే కదా.. పోరాటాల్ని ఉధృతం చేయాలన్న కాంక్ష తెలుగుదేశం నేతల్లో కనిపిస్తోంది. ఈ మూడేళ్లలోనే ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేయాలన్న తపన అదే సమయంలో ఇటు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వినిపిస్తోంది.

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   2 hours ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   4 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   4 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   9 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   11 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   11 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   11 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   11 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   12 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   13 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle