newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

మూడు రాజధానులకు ‘రాజ’ముద్ర...ఎవరెవరు ఏమన్నారంటే...?

01-08-202001-08-2020 12:43:09 IST
Updated On 01-08-2020 13:42:59 ISTUpdated On 01-08-20202020-08-01T07:13:09.389Z01-08-2020 2020-08-01T06:56:56.935Z - 2020-08-01T08:12:59.677Z - 01-08-2020

మూడు రాజధానులకు ‘రాజ’ముద్ర...ఎవరెవరు ఏమన్నారంటే...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌ రాజధానుల అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. వికేంద్రీకరణ ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లులకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. ఇటీవల రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను పరిశీలించిన గవర్నర్‌ తన ఆమోద ముద్ర వేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఆవిర్భవించనున్నాయి.

అయితే ఈ బిల్లులను గవర్నర్ ఆమోదించడంపై అధికార పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. వివిధ రాజకీయపార్టీల నేతలు ఎవరెవరు ఏమన్నారో చూద్దాం.

చంద్రబాబునాయుడు 

రాష్ట్ర చరిత్రలో చీకటి రోజని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమని, రాజ్యాంగ విరుద్ధమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.  ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడా లేవు. ఈ బిల్లులను తీసుకొచ్చి విభజన చట్టానికి చిల్లులు పొడిచారు. రాజధాని బిల్లుకు మద్దతిస్తున్నానని జగన్‌ ఆ రోజు సభలో చెప్పారు. ఇప్పుడు జగన్‌ మడమ తిప్పి రాష్ట్రానికి ద్రోహం చేశారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. కానీ మూడు రాజధానుల పేరుతో అందరినీ అయోమయానికి గురిచేస్తున్నారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర అభివృద్ధికి విఘాతం అన్నారు చంద్రబాబునాయుడు.

పవన్ కళ్యాణ్ 

కరోనా కాలం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో మూడు రాజధానుల బిల్లుని ఆమోదించడంపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్ మూడు రాజధానులకు ఇది సమయం కాదని, ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్, చత్తీస్ గడ్ రాజధాని రాయఘడ్‌ను సుమారు మూడున్నర వేల ఎకరాలలోనే నిర్మించారని పవన్ తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. 33 వేల ఎకరాలు కావాల్సిందేనని జగన్ శాసనసభలో గట్టిగా మాట్లాడారని, రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని చెప్పింది ఒక్క జనసేన పార్టీ మాత్రమేనని పవన్ చెప్పారు.

రామకృష్ణ

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ బిశ్వభూషన్ ఆమోదించడం అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా గవర్నర్ బిల్లులను ఆమోదించారని విమర్శించారు. గతంలో ఎస్‌ఈసీని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను కూడా ఇలాగే తొందరపాటుగా ఆమోదించారని ఆయన విమర్శించారు. న్యాయస్థానాల పరిధిలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని చెబుతున్న బీజేపీ ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టాలని రామకృష్ణ హితవు పలికారు.

రఘురామకృష్ణంరాజు 

రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్, వైసీపీ నేతలు రాజధాని ప్రజలను నమ్మించి మోసం చేశారని రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఇది ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహం, నయ వంచన, తడి గుడ్డతో గొంతు కోయడమని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులనేదే మోసమని, ఒకటే రాజధాని అని.. ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారని నర్సాపురం ఎంపీ చెప్పారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని చెప్పారు. అమరావతి రైతులకు తోడుగా రాష్ట్ర ప్రజలందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతి కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

సోము వీర్రాజు

'రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు'అంటూ ట్వీట్ చేశారు. దీనితో ఆ పార్టీ మూడు రాజధానులు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కనిపించింది. 

జీవీఎల్ నరసింహారావు

గవర్నర్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఫిబ్రవరి 11 2020 కేశినేని నాని ప్రశ్నకు సమాధానం చెప్పామన్నారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని చెప్పారని జీవీఎల్ అన్నారు. తాము పార్టీ పరంగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశామన్నారు. కర్నూలులో న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడానికి తాము అభ్యంతరం లేదని, అమరావతిలో రైతులకు న్యాయం జరగాలని జీవీఎల్ కోరారు. గత ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని ఎంచుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులకు ఎలా న్యాయం చేస్తుందో చెప్పాలన్నారు. 

బొత్స సత్యనారాయణ 

గవర్నర్ మూడు రాజధానుల బిల్లులను ఆమోదించడం శుభపరిణామని బొత్స తెలిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా గవర్నర్ ప్రజలకు శుభవార్తను అందించారని చెప్పారు. గవర్నర్ నిర్ణయంతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా మూడు రాజధానుల బిల్లులు ఆగలేదని బొత్స తెలిపారు. అమరావతిని కూడా తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని బొత్స తెలిపారు.విశాఖలో పరిపాలన రాజధానికి జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్తరాంధ్ర,రాయలసీమ అభివృద్ధిని ఇక వేగవంతం చేస్తామన్నారు. 

వైవీ సుబ్బారెడ్డి

మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలపటం గొప్ప విజయంగా భావించాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇది కోవిడ్ సమయమని, ప్రజలను రక్షించటం ముఖ్యమన్నారు. అయితే రాజధాని నుంచి ఇప్పటికిప్పుడు తరలిపోవటం ముఖ్యం కాదని, సరైన సమయంలో షిఫ్ట్ అవుతామని ఆయన ప్రకటించారు. వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో ముందు చూపుతో ఈ బిల్లును రూపొందించారని, కౌన్సిల్‌ను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షం అడ్డుకోవాలని చూసిందని విమర్శించారు. దేవుడి దయ, ప్రజల అండతో ఈ విజయం వరించిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

అమరావతి రైతులు 

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదించడంపై అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. తుళ్లూరులో రైతులు 'ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని', 'సేవ్‌ అమరావతి' అంటూ నినాదాలు చేశారు. అమరావతి కోసం శాంతియుతంగా పోరాటం చేస్తామని.. న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. మూడు రాజధానులు వద్దంటూ ఇతర ప్రాంతాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు.

శైలజానాథ్ 

రాజధాని వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్  ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ ఈ బిల్లులపై ఇప్పటికే హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, మండలిలో సెలక్ట్ కమిటీకి వెళ్ళడంతో ఏవిధంగా గవర్నర్ ఆమోదించారని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.  జగన్‌కు బిజేపీతో స్నేహం ఎంత గట్టితో తాము మొదటి నుంచి చెబుతునే ఉన్నామన్నారు. ఈ బిల్లుల ఆమోదంతో అమరావతి రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మండలిలో ఉమ్మారెడ్డి రాజధాని మారదని ప్రకటించారు. జగన్ ప్రతిపక్షనాయకుడిగా అసెంబ్లీలో 33వేల ఏకరాలు రాజధానికి కావాలని ప్రకటించలేదా అని ప్రశ్నించారు. 

అడ్వకేట్ లక్ష్మీనారాయణ

గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదించిన బిల్లులను బెలున్లుగా భావించాలని, ఈ బిల్లులు కోర్టులో బెలున్‌లా పేలి చెల్లకుండా పోతాయని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని వికేంద్రీకరణ బిల్లు తెచ్చారని, శాసన మండలి వ్యతిరేకించి సెలెక్ట్ కమిటీకి పంపిందని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు మండలి ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ఆయన తప్పుబట్టారు. రాజధాని వికేంద్రికరణ చేసే అర్హత అసెంబ్లీకి లేదని, రాజ్యాంగ హక్కులతో కూడిన రాజధానిని విడదీయలేరని ఆయన తెలిపారు. అన్ని తెలిసి గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించడం బాధకరమన్నారు. గవర్నర్ ఆమోదించింది బిల్లులు చట్ట రూపంలో రావాలని, అప్పుడే వాటిపై న్యాయపరమయిన పోరాటం చేయవచ్చన్నారు. 

మహిళా రైతులు

అమరావతి రైతులకు ఈరోజు చీకటి రోజు అని రాజధాని మహిళా రైతులు చెబుతున్నారు. భూములిచ్చిన రైతులను రోడ్డున పడేశారని వాపోయారు. వైసీపీ, బీజేపీ కలిసి చేసిన కుట్రే ఇదని మండిపడ్డారు. బీజేపీ నేత సోమువీర్రాజు వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్నారని రాజధాని మహిళా రైతులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలపడం అన్యాయం అన్నారు.

 

 కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

   2 hours ago


నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

   2 hours ago


కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

   4 hours ago


జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

   5 hours ago


ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

   5 hours ago


కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

   5 hours ago


బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

   5 hours ago


జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

   6 hours ago


ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

   6 hours ago


తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.... మొబైల్ టెస్టింగ్ ల్యాబ్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.... మొబైల్ టెస్టింగ్ ల్యాబ్

   7 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle