newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

మూడు ముక్కలైన జగనన్న రైతు భరోసా రత్నం!

15-10-201915-10-2019 07:35:59 IST
Updated On 15-10-2019 12:06:10 ISTUpdated On 15-10-20192019-10-15T02:05:59.650Z15-10-2019 2019-10-15T02:05:33.658Z - 2019-10-15T06:36:10.012Z - 15-10-2019

మూడు ముక్కలైన జగనన్న రైతు భరోసా రత్నం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో రైతు భరోసా కూడా ఓ రత్నం. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ఏటా 12 వేల 500 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో ఊరు.. వాడా తిరిగి ఫ్యాన్ తిప్పి మరీ చెప్పారు.

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఈ పథకం రూల్స్ అండ్ రేగులేషన్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రిపోర్ట్ కూడా సిద్ధమైంది. వైఎస్ఆర్ రైతు భరోసాగా నామకరణం చేసి ఈనెల 15న నెల్లూరు సమీపంలోని కాకుటూరులో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అయితే ఎన్నికల ప్రచారంలో మాట తప్పను.. మడమ తిప్పాను అన్న జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక మడమ వెనక్కు తిప్పలేదు కానీ పక్కకైతే తిప్పేశారు. ప్రతి రైతు కుటుంబానికి 12 వేల 500 ఇస్తామన్న జగన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కిసాన్ పథకంను కలిపి రైతు భరోసాను ఇస్తున్నారు.

జగన్ సర్కార్ ఇచ్చే 12 వేల 500 రూపాయలలో ఆరువేల రూపాయలు కేంద్రం ఇస్తే మరో 6 వేల 500 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఒకవేళ కేంద్రం కిసాన్ పథకం అమలు చేయకపోయుంటే జగన్ సర్కార్ భరోసా పథకం సగమే ఇచ్చేదా?

పోనీలే ఏదోకటి వచ్చిందే జమ అన్నట్లుగా రైతులు కూడా 6 వేల 500కు సిద్దపడి ఉండగా రేపు పథకం ప్రారంభం అనగా ఈరోజు ఆ పథకాన్ని మూడు ముక్కలు చేసి ఇవ్వనున్నామని ప్రకటించడం మరో ట్విస్ట్.

ప్రతిఏడాది మేలో రూ.7500, రబీలో రూ.4,000, సంక్రాంతికి రూ.2వేలు ఇవ్వనున్నామన్నారు. అది కూడా రైతు సంఘాలు డిమాండ్ చేశారని అందుకే ముక్కలు చేశామన్నారు. అయితే మూడు ముక్కలైన పథకాన్ని మాయ చేయడానికి గాను ఏడాదికి 12 వేల 500 రూపాయల చొప్పున నాలుగు ఏళ్ళు ఇస్తామనగా ఇప్పుడు ఐదు ఏళ్ళు ఇస్తామని.. 12 వేల 500ను 13 వేల 500కు పెంచారు.

అయితే అసలు ఇలా మూడు ముక్కలు చేయడానికి కారణాలను విశ్లేషిస్తే కేంద్రం ఇచ్చే ఆరువేల కిసాన్ నిధుల కోసమే ఇలా ముక్కలు చేసినట్లుగా కనిపిస్తుంది. కేంద్ర కిసాన్ సొమ్ము కూడా మూడు విడతలుగా వస్తుంది. ఇప్పుడు ఆర్ధికంగా 12 వేల 500 రూపాయలు ఒకేసారి ఇవ్వడానికి రాష్ట్రం వద్ద నిధుల్లేవు.

తొలి విడత నిధులకే నానా అప్పులు చేసి 5 వేల కోట్లను పోగేశారు. అందుకే కేంద్ర నిధుల సమయంలోనే తమ నిధులను కలిపి విడుదల చేస్తే పథకం అమలవుతుంది.. తామే ఇచ్చినట్లుగా పేరు వస్తుంది. అనుకున్నదే తడవుగా ఇది రైతులే కోరినట్లుగా ప్రజలకు చెప్పాలి కనుక మరో పథకం సిద్ధమైంది.

రైతు ప్రతినిధుల పేరుతో కొంత మందిని వ్యవసాయ కమిషన్ సమీక్షకు ముందు సీఎం వద్దకు పంపారు. ప్రతినిధులు తమకు ఒకేసారి రూ.12,500 ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటామని మూడు విడతలుగా ఇస్తే వ్యవసాయానికి వాడుకుంటామని చెప్పారు. అలా రైతులే డిమాండ్ చేశారని మంత్రులు ప్రకటించారు.

అయితే 12 వేల 500 రూపాయలు అది కూడా పంట వేసే సమయంలో ఇస్తామంటే ఏ రైతన్నా వద్దంటాడా? అన్నది ఆ రైతులకే తెలియాలి. మొత్తానికి భరోసా రత్నాన్ని అలా మూడు ముక్కలు చేశారు. దాన్ని కవర్ చేసేందుకు వెయ్యి పెంచారు. మీడియా కూడా రైతులకు శుభవార్తగా రాసేసుకుంది. అదే విచిత్రం!


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle