newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

మూడు ద‌శాబ్దాల నిరీక్ష‌ణ‌.. నిండుకుండ‌ను త‌ల‌పిస్తున్న సోమ‌శిల‌..!

23-09-201923-09-2019 12:55:29 IST
Updated On 23-09-2019 13:29:10 ISTUpdated On 23-09-20192019-09-23T07:25:29.349Z23-09-2019 2019-09-23T07:25:20.789Z - 2019-09-23T07:59:10.973Z - 23-09-2019

మూడు ద‌శాబ్దాల నిరీక్ష‌ణ‌.. నిండుకుండ‌ను త‌ల‌పిస్తున్న సోమ‌శిల‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నెల్లూరు జిల్లా సోమ‌శిల జ‌లాశ‌యానికి వ‌ర‌ద నీరు పోటెత్తుతోంది. మూడు ద‌శాబ్దాల నిరీక్ష‌ణ త‌రువాత జ‌లాశ‌యం పూర్తి సామ‌ర్ధ్యం వ‌ర‌కు నీటి మ‌ట్టం చేరుకోనుంది. ఇప్ప‌టికే 65 టీఎంసీల నీరు నిల్వ ఉండ‌గా, క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల‌కు ల‌క్షా ప‌ది వేల క్యూసెక్కుల పైచిలుకు వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది.

దీంతో సోమ‌శిల జ‌లాశ‌యం నుంచి కండ‌లేరు ప్రాజెక్టుకు 12వేల క్యూసెక్కులు, ఉత్త‌ర, ద‌క్షిణ కాల్వ‌ల‌కు 600 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు. వ‌ర‌ద ప్ర‌వాహం ఇలానే కొన‌సాగితే మ‌రో రెండు రోజుల్లో సోమ‌శిల 75 టీఎంసీల వ‌ర‌కు చేరుతుంద‌ని అధికారులు చెబుతున్నారు.

నెల్లూరు జిల్లా సోమ‌శిల జ‌లాశ‌యాన్ని చీఫ్ ఇంజ‌నీర్ల బృందం ప‌రిశీలించింది. ఎగువ ప్రాంతాల నుంచి వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరుతుండ‌టంతో ప్ర‌స్తుత నీటి మ‌ట్టం 60 టీఎంసీల‌కు చేరుకుంద‌ని అధికారులు తెలిపారు. మ‌రో రెండు రోజులు ఇదే వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగితే జ‌లాశ‌యం పూర్తి సామ‌ర్ధ్య‌మైన 78 టీఎంసీలకు నీరు చేరే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు.

ఈ సంవ‌త్స‌రం రాయ‌ల‌సీమ‌లో ఊహించని రీతిలో మంచి వ‌ర్షాలు రావ‌డం వ‌ల్ల దాదాపు ల‌క్ష క్యూసెక్కుల నీరు వ‌స్తుంద‌న్నారు. దాంతో ఇప్ప‌టికే రిజ‌ర్వాయ‌ర్ల లెవ‌ల్ 60 టీఎంసీల స్థాయికి నింపుకున్నామ‌న్నారు. 75, 76 టీఎంసీల‌కు చేరుకున్న త‌రువాత‌నే నీటిని కింద‌కు విడుద‌ల చేయ‌డం జరుగుతుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

కండ‌లేరు రిజ‌ర్వాయ‌ర్‌కు దాదాపుగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని విడుద‌ల చేస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు. అలాగే ఎనిమిది వేల క్యూసెక్కులు, కింద‌కు వ‌దులుతూ చెరువుల‌ను నింపుతున్నామని, సోమ‌శిల‌లో ఇదే ఫ్లో కంటిన్యూ అయితే రెండు రోజుల‌లో గేట్లు ఎత్తి స‌ముద్రానికి నీటిని వ‌దిలే అవ‌కాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కాగా, మూడు ద‌శాబ్దాల త‌రువాత సోమ‌శిల నిండుకుండ‌లా జ‌ల‌క‌ళ‌ను సొంత‌రించుకోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో జిల్లా ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే సోమ‌శిల ఇన్ ఫ్లో పెరిగితే ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్న మాట‌పై రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు చుక్క వ‌ర్షం ప‌డ‌లేద‌ని, అటువంటిది ప‌క్క జిల్లాల్లో కురిసిన వ‌ర్ష‌పు నీరుతో సోమ‌శిల నిండితే.. ఆ నీటినీ స‌ముద్రంలోకి వ‌ద‌ల‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

నీటిపారుద‌ల‌శాఖ అధికారులు ఆ ఆలోచ‌న నుంచి బ‌య‌ట‌కొచ్చి స‌ముద్రంలోకి వ‌ద‌లాల‌ని అనుకుంటున్న నీటితో సాధ్య‌మైన మేర స‌ర్వేప‌ల్లి, క‌నుపూరు, సంగం వంటి బ్యారేజీల‌ను నింపే ప్ర‌య‌త్నం చేయాల‌ని రైతులు సూచిస్తున్నారు. సోమ‌శిల ప్రాజెక్టుకు అనుసంధాన‌మై ఉన్న బ్యారేజీలు, రిజ‌ర్వాయ‌ర్ల‌ను వ‌ర‌ద‌నీటితో పూర్తి స్థాయిలో నింపుకోగ‌లిగితే మరో మూడేళ్ల‌పాటు నీటి స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉండ‌ద‌ని, ఆ దిశ‌గా అధికారులు ఆలోచ‌న చేయాల‌ని రైతులు కోరుతున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle