newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

మురిసిన విశాఖ ..సాగర తీరం జగన్ కోసం జనసంద్రం

29-12-201929-12-2019 08:49:11 IST
Updated On 29-12-2019 08:51:48 ISTUpdated On 29-12-20192019-12-29T03:19:11.836Z29-12-2019 2019-12-29T03:18:31.279Z - 2019-12-29T03:21:48.880Z - 29-12-2019

మురిసిన విశాఖ ..సాగర తీరం జగన్ కోసం జనసంద్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖనగరం ఇప్పుడు మరింతగా వెలిగిపోయేందుకు సిద్ధమయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు. విశాఖ ఉత్సవ్ ను తిలకించేందుకు జనం తరలి రావడంతో ఆర్కే బీచ్‌ జనసంద్రమైంది. ఈ ఉత్సవ్‌ రెండు రోజుల పాటు కొనసాగనుంది.

అంతకుముందు లేజర్‌ షో ద్వారా వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్ర, జగన్‌ప్రజా సంకల్పయాత్ర, సీఎం జగన్ నవరత్నాలు, విశాఖ నగరంలోని మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, రైల్, రోడ్డు కనెక్టివిటీని సీఎం వైయస్‌ జగన్‌ చిత్రం, ఆంధ్రప్రదేశ్‌ మ్యాప్‌లో ప్రదర్శించారు. ఈ లేజర్‌ షోను సీఎం వైయస్‌ జగన్‌ తిలకించారు. కైలాసగిరిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్‌ వైయస్‌ఆర్‌ సెంట్రల్‌ పార్కు చేరుకున్నారు. 

Image

ఈ సందర్భంగా  జీవీఎంసీ ఏర్పాటు చేసిన ఫ్లవర్‌ షోను జగన్ సందర్శించారు. పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపనలు చేశారు. రూ.905.05 కోట్ల పనులకు సెంట్రల్‌ పార్కులో సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేశారు. రూ. 433 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు, రూ. 52 కోట్లతో మున్సిపల్‌ స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమానికి, రూ. 109 కోట్లతో ఆర్కే బీచ్‌ అభివృద్ధి పనులకు, రూ. 9.5 కోట్లతో ముడసరలోవ రిజర్వాయర్‌ అభివృద్ధి పనులకు, రూ. 145 కోట్లతో స్మార్ట్‌ సిటీ పనులకు, రూ. 157 కోట్లతో అమృత్‌ వర్క్స్‌కు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు.

అంతకముందు  జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరారు. దారిపొడవునా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కైలాసగిరికి చేరుకున్న జగన్ విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చేపడుతున్న రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. కైలాసగిరిలో ప్లానిటోరియం ఏర్పాటు కోసం రూ. 37 కోట్లు, కాపులుప్పాడలో బయో మైనింగ్‌ ప్రాసెసింగ్‌కు రూ. 22.5 కోట్లు, లా కాలేజీ నుంచి బీచ్‌ రోడ్డు వరకు 80 ఫీట్ల రోడ్డు విస్తరణకు రూ. 7.5 కోట్లు, బీచ్‌ రోడ్డులో పర్యాటక కాంప్లెక్స్, మ్యూజియంకు రూ. 40 కోట్లు ఖర్చుచేయనున్నారు.

చుక్కవానిపాలెంలో 60 ఫీట్ల మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుకు రూ. 90 కోట్లు, సిరిపురం జంక్షన్‌లో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్, వాణిజ్య సముదాయం కోసం రూ. 80 కోట్లు, నేచురల్‌ హిస్టరీ పార్క్, మ్యూజియం రీ సెర్చ్‌ సంస్థకు రూ. 88 కోట్లు, ఐటీ సెజ్‌ నుంచి బీచ్‌ రోడ్డు నిర్మాణం కోసం రూ. 75 కోట్లతో సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేశారు.

విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు జగన్. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాదిమందిని తరలించారు వైసీపీ నేతలు. జిగేల్‌మనే లేజర్‌ షో.. బాణసంచా వెలుగుల నడుమ.. విశాఖ సంబరాలు  ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవాలు ముగిసిన అనంతరం తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌జైన్‌ దంపతులను సత్కరించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle