newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

మునిగిన బ‌తుకులు : బోటు మున‌క‌కు క‌ళ్లు చెదిరే కార‌ణాలు..!

16-09-201916-09-2019 08:25:24 IST
2019-09-16T02:55:24.272Z16-09-2019 2019-09-16T02:55:01.495Z - - 14-10-2019

మునిగిన బ‌తుకులు :  బోటు మున‌క‌కు క‌ళ్లు చెదిరే కార‌ణాలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆహ్లాద గోదావ‌రి విషాద గోదావ‌రిగా మారిపోయింది. ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు వెళ్లిన వారు తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లిన వారు కొంత మంది మాత్ర‌మే ఈ రోజు ప్రాణాల‌తో ఉన్నారు. మ‌రికొంత మంది జాడ‌లేదు. మ‌రికొంత మంది ప్రాణాలు కోల్పోయి విగ‌త‌జీవులుగా మిగిలారు. త‌ర‌చి.. త‌ర‌చి చూస్తే ప్ర‌తి ప్ర‌మాదం వెనుక ఏదో ఒక చోట నిర్ల‌క్ష్యం క‌నిపిస్తూనే ఉంటుంది. బాధ్యుత‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం మ‌రోవైపు స‌హాయ‌క చ‌ర్య‌లను కొన‌సాగిస్తోంది. కానీ త‌మ వారిని కోల్పోయిన కుటుంబ స‌భ్యులు మాత్రం గోదావ‌రి ఉబికేంత క‌న్నీటిని కారుస్తూ ఏడుస్తున్న దృశ్యాలు అంద‌ర్ని క‌ల‌చివేస్తున్నాయి.

గోదావ‌రి బోటు ప్ర‌మాదం ఎలా జరిగిందంటే..?

ప్ర‌కృతి విప‌త్తులు లేని ఏ ప్ర‌మాదాన్ని చూసినా అందులో నిర్ల‌క్ష్యం త‌ప్ప‌నిస‌రిగా క‌నిపిస్తుంటుంది. అలానే ఈ ప్ర‌మాదంలోనూ ప‌ది కార‌ణాలు ఉన్న‌ట్టు తెలుస్తుంది. బోటులో మూడు ఇంజ‌న్‌లు ఉండాల్సిన చోట ఒకే ఇంజ‌న్ ఉండ‌టం గ‌మ‌నార్హం. అలాగే లాంచ్ మునిగే స‌మ‌యంలో అంద‌రూ లైవ్ జాకెట్‌లు వేసుకుని ఉండ‌లేదు. ఇక అక్క‌డ 5.4ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటి ప్ర‌వాహం ఉంది. ఈ నీటి ప్ర‌వాహ ఉధృతి చాలా ఎక్కువ‌గా ఉంది.

అంతేగాక ప్ర‌మాద స‌మ‌యంలో బోటులో క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రామ్స్ జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. అదే స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగితే తొక్కిస‌లాట‌కు దారితీసే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బోటు మునిగిన ప్రాంతంలో లోతు ఎక్కువ‌గా ఉండ‌టంతోపాటు ప్ర‌మాద స‌మ‌యంలో నీటి ఉధృతి కార‌ణంగా సుడులు వచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు  సంబంధిత నిపుణులు చెబుతున్నారు. వ‌ర‌ద ఉధృతిపై అవ‌గాహ‌న లేకుండా బోటును న‌దిలోకి పంప‌డం ప్ర‌మాదానికి కార‌ణంగా ప‌లువురు చెబుతున్నారు.

వర‌ద‌లు, వ‌ర్షాలు సంభ‌వించి నీటి ప్ర‌వాహం అధిక స్థాయిలో ఉన్నా బోటు ప్ర‌యాణం చేయ‌డం స‌రైన నిర్ణ‌యం కాద‌న్న అభిప్రాయాన్ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. అలాగే లాంచీల ప్ర‌యాణంపై నిఘా కొర‌వ‌డ‌టం కూడా ప్ర‌మాదానికి కార‌ణంగా వారు చెప్పుకొస్తున్నారు. ఇదే స‌మ‌యంలో న‌దిప‌రివాహక ప్రాంతంపై ఎటువంటి అవ‌గాహ‌న లేని స్థానికేత‌రులకు బోటును న‌డిపే అవ‌కాశం ఇవ్వ‌డాన్ని మ‌రికొంద‌రు త‌ప్పుబ‌డుతున్నారు.

మొత్తానికి గోదావ‌రిలో ప‌డ‌వ మున‌క ఇరు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చింది. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన ప‌ర్యాట‌కులు ఈ ఘ‌ట‌న‌లో మృత్యువాత‌ప‌డ్డారు. ఇటు వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్ నుంచి అటు విశాఖ‌, తిరుప‌తికి చెందిన ప‌ర్యాట‌కులు గ‌ల్లైంత‌న వారు ఎక్కువ సంఖ్య‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది.

నీ బిడ్డ‌కు ఏం తెమ్మంటావ‌మ్మా..!

గోదావ‌రిలో ప‌డ‌వ మున‌క సంఘ‌ట‌న‌లో వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌డిపికొండ‌కు చెందిన 14 మంది పాపికొండ‌ల విహార‌యాత్ర‌కు వెళ్ల‌గా, అందులో తొమ్మిది మంది గ‌ల్లంతైన‌ట్టు అధికారులు ధృవీక‌రించారు. దీంతో క‌డిపికొండ గ్రామ‌మంతా విషాద‌చాయ‌లు అలుముకున్నాయి. ఈ ఒక్క గ్రామానికి చెందిన తొమ్మిది మంత్రి గోదావ‌రిలో గ‌ల్లైంత‌న నేప‌థ్యంలో కుటుంబ స‌భ్యులంతా క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. గ‌ల్లైంత‌న‌ క‌డిపికొండ‌కు చెందిన రాజేంద‌ర్ అనే వ్య‌క్తి కుమార్తె మీడియాతో మాట్లాడుతూ శుక్ర‌వారం రాత్రి త‌న తండ్రితో మాట్లాడాన‌ని, రైల్వే స్టేష‌న్ నుంచి త‌న తండ్రి ఫోన్ చేసి నీ బిడ్డ‌కు ఏం తెమ్మంటావ‌మ్మా అని అడిగాడ‌ని తెలిపింది. ఎక్క‌డ‌కెళ్తున్నావ్‌.. నాయ‌నా.. అని అడ‌గ్గా పాపికొండ‌ల‌ను చూసొస్తా.. మ‌నోళ్ల‌మంద‌రం క‌లిసి పోతున్నామ‌ని చెప్పాడ‌ని, ఆ త‌రువాత మ‌ళ్లీ ఫోన్ చేస్తే క‌ల‌వ‌లేద‌ని మీడియాకు తెలిపింది.

కుటుంబంలో ఒక్క‌డే మిగిలాడు..!

హైద‌రాబాద్ నుంచి మొత్తం 22 మంది పాపి కొండ‌ల‌కు విహార యాత్ర‌కు వెళ్లారు. ఉప్ప‌ల్‌కు చెందిన జాన‌కి రామారావు మిన‌హా మిగిలిన ఐదుగురు మృత్యువాత ప‌డ్డారు. దీంతో జాన‌కి రామారావు ప్ర‌మాదాన్ని గుర్తుకు తెచ్చుకుని మ‌రీ క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన జాన‌కి రామారావు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పాపికొండ‌ల విహార యాత్ర‌కు వెళ్లారు. చివ‌ర‌కు ఒంట‌రిగా మిగిలిపోయారు.

ప్లాస్టిక్ కుర్చీలే ప్ర‌మాదానికి కార‌ణం..!

గోదావ‌రి బోటు ప్ర‌మాదానికి సంబంధించి వ‌రంగ‌ల్ నుంచి వ‌చ్చిన ఓ టూరిస్ట్  మాట్లాడారు. ఆయ‌న మాట‌ల్లో.. ప‌డ‌వ మునిగిన స్పాట్‌కు ఐదు నిమిషాల ముందు అంద‌ర్ని ప‌డ‌వ ఎక్క‌మ‌న్నారు. పైన ప్లాస్లిక్ కుర్చీలు వేసి బ్యాలెన్స్‌గా కూర్చోమ‌న్నారు. స‌రిగ్గా ప‌డ‌వ మునిగిన స్పాట్‌కు వ‌చ్చిన త‌రువాత చిన్న జ‌ర్క్ ఇచ్చింది. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో ప‌డ‌వ ఒక్క‌సారిగా వ‌ణికింది. దాంతో లెఫ్ట్ సైడ్ ప్లాస్టిక్ కుర్చీల మీద కూర్చున్న‌వారందరూ వ‌చ్చి లెఫ్ట్ సైడ్ వారిపై ప‌డ‌టంతో బోటు ఒక్క‌సారిగా ఉల్టా తిరిగింది. అలా అంద‌రూ న‌దిలో ప‌డిపోయాము. నాకు ఈత రావ‌డంతో ప్రాణాల‌ను కాపాడుకోవ‌డంత‌పాటు స‌మీపంలోని వారంద‌రికీ లైవ్ జాకెట్‌లు ఇచ్చా. కొద్దిసేప‌టికే మా ఆర్త‌నాదాలు విన్న క‌చ్చులూరు గ్రామస్తులు రెండు బోట్ల‌లో వ‌చ్చి మ‌రికొంద‌రిని కాపాడ‌గ‌లిగారు.

మామ అస్థిక‌లు క‌ల‌ప‌డానికి వ‌చ్చి..!

తిరుప‌తి నుంచి వ‌చ్చిన ఓ మ‌హిళా టూరిస్టు .. గోదావ‌రి బోటు ప్ర‌మాదంలో నా పాప‌ను, భ‌ర్త‌ను కోల్పోయా. బోటు పాపికొండ‌ల‌కు బ‌య‌ల్దేరే ముందు పోలీసులు, అధికారులు వ‌చ్చి అన్నీ చెక్ చేసుకుని టూరిస్టుల ఫోటోల‌ను కూడా తీసుకెళ్లారు. కానీ వ‌రద ఉధృతి ఎక్కువ‌గా ఉంది. వెళ్లొద్ద‌ని ఏ అధికారి చెప్ప‌లేదు. వారు చెప్పి ఉంటే అప్పుడే ప‌డ‌వ దిగేసేవార‌ము. మామ‌గారి అస్థిక‌లు గోదారిలో క‌లిపేందుకు రాజమండ్రి వ‌చ్చాము.

ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే కార‌ణం..!

గోదావ‌రిలో బోటు మున‌క సంఘ‌ట‌న‌పై టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు. ప్ర‌మాదానికి గురైన బోటుకు ప‌ర్మీష‌న్ లేదని అధికారులు చెబుతున్నార‌న్నారు. అలాగే ప్ర‌భుత్వ లోపం కూడా గోదావ‌రిలో బోటు మున‌క‌కు కార‌ణ‌మ‌ని జ్యోతుల నెహ్రూ చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వ అజమాయిషీ లేన‌టువంటి కార‌ణంగానే ప‌ర్మీష‌న్ లేన‌టువంటి బోట్లు గోదావ‌రిలో తిరుతున్నాయ‌న్నారు. 5 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద నీరు వ‌స్తున్న ప‌రిస్థితుల్లో పాపికొండ‌ల‌వైపు బోట్లు తిరిగేందుకు అనుమ‌తులు ఇవ్వ‌డ‌మ‌న్న‌ది ప్ర‌భుత్వ వైఫ‌ల్యంగానే తాము భావిస్తున్న‌ట్టు జ్యోతుల నెహ్రూ చెప్పారు.

ఏపీ టూరిజానికి మాయ‌ని మ‌చ్చ‌..!

గోదావ‌రిలో బోటు మున‌క‌పై మాజీ హోంమంత్రి చిన‌రాజ‌ప్ప స్పందించారు. వ‌ర‌ద స‌మ‌యంలో ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. మొత్తం మీద బోటులో 75 మంది ఉన్న‌ట్టు అంచ‌నా వేస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మంది బ‌య‌ట‌కు వ‌చ్చారు..?  ఇంకా ఎంత మంది గ‌ల్లంత‌య్యారు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఇంకా అధికారుల నుంచి స‌మాధానం లేద‌న్నారు. అలాగే వ‌ర‌ద స‌మ‌యంలో లాంచ్‌ను ఆప‌రేట్ చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని చిన‌రాజ‌ప్ప అన్నారు. ఏపీ టూరిజానికి ఈ దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న మాయ‌ని మ‌చ్చ‌లా ఉండిపోతుంద‌ని, ఇక‌పై ఏపీలోని ప‌ర్యాట‌క ప్రాంతాల్లో పూర్తి స్థాయి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ఇదిలా ఉండ‌గా, గోదావ‌రిలో ప‌డ‌వ ప్ర‌మాదానికి సంబంధించి మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఎక్స్‌గ్రేషియో ప్ర‌క‌టించింది. ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన సీఎం జ‌గ‌న్ వివ‌రాల‌పై అధికారుల‌ను ఆరా తీశారు. మృతుల కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం చెల్లించాల‌ని అధికారుల‌ను సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయాలని చెప్పిన జ‌గ‌న్ ఈ రోజు బోటు ప్ర‌మాద స్థ‌లిని ప‌రిశీలించ‌నున్నారు. 

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   44 minutes ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   20 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


 గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య.. జగన్ కొత్త నిర్ణయం

గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య.. జగన్ కొత్త నిర్ణయం

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle