newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

ముద్రగడ లేఖ రగడ...కాపు ఉద్యమం రాజుకుంటోందా?

29-07-201929-07-2019 12:59:49 IST
Updated On 29-07-2019 13:04:17 ISTUpdated On 29-07-20192019-07-29T07:29:49.637Z29-07-2019 2019-07-29T07:29:47.113Z - 2019-07-29T07:34:17.470Z - 29-07-2019

ముద్రగడ లేఖ రగడ...కాపు ఉద్యమం రాజుకుంటోందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో మళ్ళీ కాపు ఉద్యమం ఊపిరి పోసుకుంటోంది. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి యాభై రోజులు అవుతోంది. అయితే తమకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చడం లేదని కాపుఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆగ్రహంతో ఉన్నారు. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈబీసీ కోటాలో 5 శాతం రిజర్వేషన్లపై ... ఏ కోర్టు స్టే ఇచ్చిందో సీఎం జగన్ చెబితే సంతోషిస్తానన్నారు ముద్రగడ..

న్యాయస్థానం స్టే ఉంటే తిరిగి ఎన్నికలు వచ్చే వరకు కాపుల హక్కులు, డిమాండ్లను అడగకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుంటానని ముద్రగడ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాపు జాతి ఎటువంటి కోరికలు లేకుండా బానిసలుగా బతకాలా..? అని పద్మనాభం ప్రశ్నించారు.

మీరు ఎన్నికల హామీలో చెప్పిన రూ. 2 వేల కోట్లకు ఆశపడి.. కాపులు మీకు ఓటేశారని భావిస్తున్నారా అంటూ ఆయన మండిపడ్డారు. కాగా.. కాపు రిజర్వేషన్లపై వైసీఎల్పీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయ్యారు. కాపు రిజర్వేషన్లతో పాటు పాటు ఈబీసీ బిల్లుపై వారు చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితర కాపు నేతలు హాజరయ్యారు.

అంతేకాదు.. లేఖ చివరిలో ముద్రగడ రాసిన పదాలు చర్చనీయాంశంగా మారాయి. చిన్నమనవి అంటూ తమరి సోదరి షర్మిలగారి మీద బూతులు సోషల్ మీడియలో ప్రచారం అయిన సందర్భంగా వారు బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇచ్చే పరిస్థితి వచ్చింది.

అలాగే ఈరోజు నన్ను కాపు ద్రోహి, స్వార్థపరుడు, గజదొంగ, అమ్ముడుపోయాడు, మునిగిపోయిన ముద్రగడ అంటూ ఎన్నో బూతులు అన్నిపార్టీల వారు రాయిస్తున్నారు. వాటికి బెదిరిపోవడానికి నేనేం ఎన్నారైని కాదన్నారు  ముద్రగడ. మొత్తం మీద మరో ఉద్యమానికి ముద్రగడ తయారవుతారేమోనని  పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

No photo description available.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle