newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

26-05-202026-05-2020 08:37:31 IST
Updated On 26-05-2020 09:51:32 ISTUpdated On 26-05-20202020-05-26T03:07:31.290Z26-05-2020 2020-05-26T03:07:28.922Z - 2020-05-26T04:21:32.746Z - 26-05-2020

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుమల తిరుపతి భూముల వేలం వివాదం ముదిరి పాలకమండలి నుండి ప్రభుత్వం వరకు విమర్శల పాలవడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే టీటీడీ పాలకమండలి భూముల వేలానికి రెండు కమిటీలను నియమించగా .. తాజాగా ఆ కమిటీలు వేలానికి కాదని.. జస్ట్ వేలానికి రోడ్ మ్యాప్ మాత్రమే తయారుచేసేందుకే నియమించామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సెలవిచ్చారు.

అంటే చైర్మన్ చెప్పిన మాటల ప్రకారం వేలం వేయాలంటే ఎలా వేయాలని ఒక కమిటీ చెప్తే.. ఎలా ముందుకు వెళ్ళాలో ఇంకో కమిటీ చెప్తుందంట. ఆ రెండు కమిటీల నివేదికలు వచ్చాకనే భూముల అమ్మకంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు భూముల అమ్మకానికి నిర్ణయించుకున్నామని అసత్య ప్రచారం చేస్తుందని కౌంటర్ ఆరోపణలు కూడా చేసేశారు.

ఇక ఏపీ ప్రభుత్వం అయితే భూముల అమ్మకాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేసేసింది. అయితే.. ఇప్పుడు టీటీడీ పాలకవర్గం అమ్మకానికి నిర్ణయించుకుందని.. ఆ నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్లుగా కాకుండా.. 2016, జనవరి 30న టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకోసం జీవో నెంబర్‌ 888ను విడుదల చేశారు.

ఇక ఇప్పుడున్న పాలకవర్గానికి అయితే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని భూముల అమ్మకంపై పునఃపరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకోసం పాలకమండలి మతపెద్దలు, భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు, ధర్మప్రచారకులతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను కూడా తీసుకోవాలని సూచించింది. అయితే టీటీడీ మాత్రం అమ్మకానికి ఇంకా నిర్ణయమే తీసుకోలేదని టర్న్ ఇచ్చేసింది.

అయితే టీటీడీ భూముల వేలం విషయంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలపాలైంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తులు దీనిపై తీవ్రంగా విమర్శలకు దిగారు. ఇక అటు ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా నేతలు టీటీడీ నిర్ణయంపై తీవ్ర విమర్శలకు దిగారు. తెలంగాణ బీజేపీ అయితే ఏకంగా టీటీడీ ఆస్తులను కాపాడేందుకు దేనికైనా సిద్ధమని ప్రకటించేశారు.

ఇక ఏపీ బీజేపీ అయితే నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగనుంది. భక్తులు ఏడుకొండలవాడికి ఇచ్చిన భూములను కాపాడే దమ్ములేదా? అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శలు చేయడంతో పాటు మీరు చేసే దద్దమ్మ పనులను మళ్ళీ నిరర్ధక ఆస్తులను కొత్త కొత్త పేర్లను తెరమీదకి తెస్తారా? అంటూ రెచ్చిపోయారు. టీటీడీ ఆస్తులను కాపాడేందుకు వీధి పోరాటాలకు కూడా తాము సిద్ధమని ప్రకటించారు.

అయితే, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగుతామని కన్నా సోమవారం ప్రకటించగా అదేరోజు ప్రభుత్వం అమ్మకం నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఈరోజు బీజేపీ ధర్నాను కొనసాగిస్తారా? లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయితే ఈ విషయంపై పెద్దఎత్తున విమర్శలకు దిగింది. గల్లీ స్థాయి నేత నుండి చంద్రబాబు వరకు గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్లారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వర్షం కురిపిస్తూ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. జనసైనికుల పేరిట సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వాన్ని తూర్పార పట్టేశారు. ఇక ఇటు తెలుగు మీడియా నుండి నేషనల్ మీడియా వరకు టీటీడీ ఆస్తుల వేలం విషయాన్ని భారీగా హైలెట్ చేశాయి. దీంతో మొత్తంగా ప్రభుత్వం అమ్మకం నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే టీటీడీకి పునఃసమీక్షించుకోవాలని మాత్రమే తెలిపింది. మరి పూర్తిగా వేలం ఆపేసినట్లేనా లేక కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లుగానే భావించాలా?! 

 

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

   4 hours ago


ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

   4 hours ago


స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

   4 hours ago


భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

   5 hours ago


బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

   7 hours ago


ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

   8 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

   9 hours ago


ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

   9 hours ago


వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

   20-09-2020


కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

   20-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle