newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

ముచ్చ‌ట‌గా ముగ్గురూ క‌లుస్తారా..?

19-11-201919-11-2019 08:22:04 IST
Updated On 19-11-2019 10:43:18 ISTUpdated On 19-11-20192019-11-19T02:52:04.892Z19-11-2019 2019-11-19T02:51:15.620Z - 2019-11-19T05:13:18.355Z - 19-11-2019

ముచ్చ‌ట‌గా ముగ్గురూ క‌లుస్తారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో వారు ముగ్గురు ద‌గ్గ‌రి స్నేహితులు. పార్టీలు వేరైనా ఒక‌రికొక‌రు వ్య‌క్తిగ‌తంగా ఆత్మీయంగా ఉంటారు. ప‌ర‌స్ప‌రం రాజ‌కీయ స‌ల‌హాలు ఇచ్చి పుచ్చుకుంటారు. కానీ, ముగ్గురూ ఎప్పుడూ ఒకే పార్టీలో మాత్రం ఉండ‌టం కుద‌ర‌డం లేదు. ఆ ముగ్గురే మంత్రి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, వంగ‌వీటి రాధా. ఇప్పుడు వంశీ వైసీపీలో చేర‌డం ఖాయం కావ‌డంతో రాధా నిర్ణ‌యం ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

తండ్రికి ఉన్న పేరు, మంచి అనుచ‌ర‌గ‌ణంతో వంగ‌వీటి రాధా ఇప్ప‌టికే రాజ‌కీయంగా మంచి స్థానంలో ఉండే అవ‌కాశం ఉండేది. కానీ, వివిధ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న తీసుకున్న త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో రాధా రాజ‌కీయంగా ఎదగ‌లేక‌పోతున్నారు.

2009లో అధికార పార్టీని వ‌దిలి ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్లి ఓడిపోవ‌డం, 2019లో జ‌గ‌న్ హ‌వాను అంచ‌నా వేయ‌లేక టీడీపీలోకి వెళ్లి పోటీ కూడా చేయ‌కపోవ‌డం రాజ‌కీయంగా రాధా తీసుకున్న విఫ‌ల నిర్ణ‌యాలు.

వైసీపీలోనే ఉంటే ఆయ‌న క‌చ్చితంగా ఈ ఎన్నిక‌ల్లో గెలిచి ఉండేవారు. కాపు కోటాలో మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కే అవ‌కాశాలు ఉండేవి. కానీ, ఎన్నిక‌ల వేళ ఆయ‌న జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి టీడీపీలోకి వెళ్లారు.

త‌న తండ్రి ఏ పార్టీపైనైతే పోరాడారో అదే పార్టీలోకి రాధా వెళ్ల‌డాన్ని ఆయ‌న అనుచ‌రులు సైతం జీర్ణించుకోలేక‌పోయారు. రాధాకు చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ప‌ద‌విపై హామీ ఇచ్చినా ఎన్నిక‌ల ముందు ఆ ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఇప్పుడు టీడీపీకి ఉన్న బ‌లంతో ఎమ్మెల్సీ ఇచ్చే అవ‌కాశం లేదు.

దీంతో రాధా టీడీపీలో యాక్టీవ్‌గా లేరు. తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరాల‌ని వ‌ల్ల‌భ‌నేని వంశీ నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో రాధా మ‌ళ్లీ వైసీపీలోకి వెళ్తారా అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌య‌మై ఓ మీడియాతో వంశీ మాట్లాడుతూ.. రాధా త‌మ‌కంటే మంచి స్థానంలో ఉండాల్సిన వ్య‌క్తి అని, కానీ, అలా జ‌ర‌గ‌లేద‌ని బాధ‌ప‌డ్డారు.

ముగ్గురు మిత్రులూ ఒకే పార్టీలో ఉంటారా అనే ప్ర‌శ్న‌కు వంశీ స్పందిస్తూ.. కొడాలి నాని ఈ మేర‌కు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

వాస్త‌వానికి రాధా టీడీపీలో చేరినా గుడివాడ‌లో అంత‌ర్గ‌తంగా ఆయ‌న మ‌ద్ద‌తు త‌న స్నేహితుడైన వైసీపీ అభ్య‌ర్థి కొడాలి నానికే ఇచ్చారు. దీంతో రాధాను మ‌ళ్లీ వైసీపీలోకి తెచ్చేందుకు నాని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వంశీ మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అయితే, వైసీపీని వీడే ముందు రాధా జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కానీ, టీడీపీ ప్రోద్బ‌లంతోనే ఆయ‌న ఇలా విమ‌ర్శ‌లు చేశార‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు.

జ‌గ‌న్ కూడా త‌న‌ను విమ‌ర్శించిన వారు పార్టీలోకి వ‌స్తామంటే పాత సంఘ‌ట‌నల‌ను మ‌రిచిపోయి ఆహ్వానించ‌డం అనేక మంది విష‌యంలో చూశాం. ఆ మాటకొస్తే ఇప్పుడు వైసీపీలో మంత్రి ప‌ద‌వుల్లో ఉన్న వారు కూడా గ‌తంలో జ‌గ‌న్‌పై అనేక విమ‌ర్శ‌లు చేసిన‌వారు.

కాబ‌ట్టి, రాధా వైసీపీలోకి రావాల‌నుకుంటే, ఇందుకు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తే జ‌గ‌న్ క‌చ్చితంగా ఒప్పుకునే అవ‌కాశం ఉంది.

కానీ, రాధా మ‌ళ్లీ వైసీపీ వైపు చూసే అవ‌కాశాలు మాత్రం త‌క్కువ‌గానే ఉన్నాయి. ఒక‌సారి పార్టీని కాద‌ని వ‌చ్చాక తిరిగి వెళ్ల‌డం ఆయ‌న స్వ‌భావానికి స‌రిపోదు. కాబ‌ట్టి, ఆయ‌న జ‌న‌సేన వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల సీరియ‌స్ పాలిటిక్స్ చేస్తుండ‌టం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ - జ‌న‌సేన పొత్తు ఉండ‌టం ఇంచుమించు ఖాయంగా క‌నిపిస్తుండ‌టం, త‌న సామాజిక‌వ‌ర్గంలో ఎక్కువ మంది జ‌న‌సేన‌కు అండ‌గా నిలిచే అవ‌కాశం ఉండ‌టంతో ఆయ‌న జ‌న‌సేన వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి, రాధా పాత విష‌యాలు మరిచి మిత్రుల‌తో న‌డుస్తారో లేదా జ‌న‌సేన‌తో కొత్త బాట‌లో న‌డుస్తారో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle