newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ముగ్గురు మంత్రుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయా..?

27-04-201927-04-2019 08:20:54 IST
2019-04-27T02:50:54.344Z27-04-2019 2019-04-27T02:50:48.524Z - - 17-07-2019

ముగ్గురు మంత్రుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు ముగిసి 15 రోజుల‌వుతోంది. ప్ర‌జ‌ల తీర్పు మే 23న తేల‌నుంది. అయితే, పార్టీలు, అభ్య‌ర్థులు మాత్రం గెలుపోట‌ముల‌పై కూడిక‌లు, తీసివేత‌లు చేస్తున్నారు. పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి గెలుపు అవ‌కాశాల‌ను బేరీజు వేసుకుంటున్నారు. అయితే, చంద్ర‌బాబు క్యాబినెట్‌లో ముగ్గురు మంత్రుల‌కు మాత్రం ఫ‌లితాలు ఏ విధంగా వ‌స్తాయోన‌ని టెన్ష‌న్ ప‌ట్టుకుంది. వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌ట్టి పోటీ జ‌ర‌గ‌డంతో గెలుస్తామో లేదోన‌ని బెంగ పెట్టుకున్నారు.

విశాఖ‌ప‌ట్నం జిల్లా న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం మంత్రి అయ్య‌న్న‌పాత్రుడికి కంచుకోట లాంటిది. ఇక్క‌డి నుంచి ఆయ‌న వ‌రుస‌గా ఎనిమిది సార్లు పోటీ చేసి ఆరుసార్లు గెలుపొందారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సినీ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్ సోద‌రుడు పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్ గ‌ట్టి పోటీ ఇచ్చారు. కేవ‌లం 2338 ఓట్ల మెజారిటీతో అయ్య‌న్న గ‌త ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కారు. ఈసారి మ‌ళ్లీ వైసీపీ నుంచి గ‌ణేష్ పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల కంటే ఆయ‌న మరింత బ‌లం సంపాదించుకున్నారు.

దీంతో అయ్య‌న్నపాత్రుడుకు గ‌ణేష్ గ‌ట్టి పోటీ ఇచ్చారు. దీంతో అయ్య‌న్న ఒక అడుగు వెన‌క్కేసి గ‌తంలో త‌న‌తో విభేదాలు ఉన్న కుటుంబ‌స‌భ్యులు, ఇత‌ర నాయ‌కుల‌ను సైతం క‌లుపుకొని వెళ్లారు. అయినా కూడా ఈసారి అయ్య‌న్న‌కు గెలుపుపై పెద్ద‌గా ధీమా క‌నిపించ‌డం లేదు.

చంద్ర‌బాబు క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా ప‌నిచేసిన చిన‌రాజ‌ప్ప కూడా ఈసారి ఎదురీదుతున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా పెద్దాపురం నుంచి పోటీ చేసిన ఆయ‌న‌కు వైసీపీ, జ‌న‌సేన నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది. ముఖ్యంగా వైసీపీ నుంచి బ‌రిలో నిలిచిన ఎంపీ తోట న‌ర‌సింహం భార్య‌, మాజీ మంత్రి మెట్ల స‌త్య‌నారాయ‌ణ కూతురు తోట వాణి గ‌ట్టి పోటీ ఇచ్చారు.

చిన‌రాజ‌ప్ప‌కు ఆయ‌న సామాజిక‌వ‌ర్గం వారు ఈసారి కొంత వ్య‌తిరేకంగా మారార‌నే అంచ‌నాలు ఉన్నాయి. తోట వాణి చివ‌రి నిమిషంలో వ‌చ్చినా వైసీపీ క్యాడ‌ర్ పూర్తిగా స‌హ‌క‌రించ‌డం, బ‌ల‌మైన నేత‌లు వైసీపీలో చేర‌డం, ఆమె తండ్రి, భ‌ర్త‌కు ఉన్న పేరు, భ‌ర్త అనారోగ్యం కార‌ణంగా సానుభూతి, ఇలా అన్ని ఎంతో కొంత క‌లిసివ‌చ్చాయి. దీంతో చిన‌రాజప్ప విజ‌యం అంత సులువు కాద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

బాబు హ‌యాంలో మ‌రో కీల‌క మంత్రి దేవినేని ఉమా కూడా ఈసారి గ‌ట్టి పోటీ ఎదుర్కున్నారు. కృష్ణ జిల్లా మైల‌వ‌రం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి జోగి ర‌మేష్ పై 7,569 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈసారి వైసీపీ ఇక్క‌డి నుంచి మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ ను బ‌రిలో దింపింది. ఏడాది క్రిత‌మే ఆయ‌న‌కు టిక్కెట్ ఖ‌రారు చేయ‌డంతో అప్ప‌టినుంచే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేసుకున్నారు.

ఇద్ద‌రూ బ‌ల‌మైన నేత‌లు కావ‌డం, ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కావడం వ‌ల్ల పోటీ హోరాహోరీ జ‌రిగింది. డ‌బ్బు ప్ర‌భావం సైతం విప‌రీతంగా ప‌నిచేసింద‌నే అంచ‌నాలు ఉన్నాయి. డబ్బు ఖ‌ర్చు చేయ‌డంలో ఎవ‌రూ త‌గ్గ‌లేదు. వైసీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని కీల‌కంగా తీసుకుంది. ఇక్క‌డ‌, జ‌గ‌న్‌, ష‌ర్మిల ఇద్ద‌రూ ప్ర‌చారం చేశారు. ఇక్క‌డ దేవినేని గెలుపు అంత సులువు కాద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఒక‌వేళ గెలిచినా అత్తెస‌రు మెజారిటీతో బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు అంటున్నారు. మొత్తానికి చంద్ర‌బాబు క్యాబినెట్ లో కీల‌క మంత్రులుగా ఉన్న ముగ్గురికి ఈ ఎన్నికల్లో విజయం క‌ష్ట‌మే అనే ప‌రిస్థితి ఉండ‌టం ఆస‌క్తిక‌రం.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle