ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. సీఎస్‌తో బాబు మాటామంతీ

14-05-201914-05-2019 17:13:03 IST
Updated On 14-05-2019 18:18:54 ISTUpdated On 14-05-20192019-05-14T11:43:03.927Z14-05-2019 2019-05-14T11:43:01.952Z - 2019-05-14T12:48:54.932Z - 14-05-2019

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..  సీఎస్‌తో బాబు మాటామంతీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈసీకి అందచేసిన ఎజెండాకు అనుగుణంగా ఆయా అంశాలపై చర్చించారు. ఫొని తుపాను., తాగునీరు కరువు పరిస్థితులపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ కేబినెట్ భేటీకీ మంత్రులు పితాని, యనమల, ఫరూక్, సుజయ్ కృష్ణ రంగారు గైర్హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌కు ఇదే చివరి సమావేశం కావడం విశేషం.

ఎన్నాళ్ళనుంచో ఎడమొహం పెడమొహంగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం చంద్రబాబు మధ్య మాటామంతీ కనిపించింది. సమావేశానికి హాజరైన సీఎస్ కాసేపు చంద్రబాబుతో సరదాగా మాట్లాడారు.

ఈ కేబినెట్ భేటీలో  మంత్రులు అమరనాథ్ రెడ్డి, పరిటాల సునీత, భూమా అఖిలప్రియ, ఆనంద్ బాబు,  జవహర్, శిద్దా రాఘవరావు, అమర్ నాథ్ రెడ్డి,  కాల్వ శ్రీనివాసులు, నారా లోకేశ్, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు,  కళా వెంకట్రావు, నారాయణ,  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, పత్తిపాటి పుల్లారావు, ఆదినారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర హాజరయ్యారు.

సీఎస్‌తో నవ్వుతూ మాట్లాడుతున్న చంద్రబాబు 

 ఏపీ కేబినెట్ భేటీకి ముందు సరదాగా మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

మంత్రులు పితాని, యనమల, ఫరూక్, సుజయ్ కృష్ణ రంగారు గైర్హాజరవడం చర్చనీయాంశం అవుతోంది. కేబినెట్ భేటీలో పలు శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరవు, ఫొని తుపాను ప్రభావం, తాగునీటి ఎద్దడితో పాటు వాతావరణ పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పనులకు నిధుల చెల్లింపు అంశాలపై కీలకంగా చర్చించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ప్రభుత్వం ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే తమ అనుమతి తీసుకున్నాకే అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.

సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో కేబినెట్‌ భేటీ ముగిసింది. ఫలితం మాట అటుంచితే, కేబినెట్ భేటీ పెట్టి తీరతానన్న చంద్రబాబు పంతం మాత్రం నెరవేరింది. బహుశా చంద్రబాబు హయాంలో ఇదే చివరి కేబినెట్ భేటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle