newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చ

27-12-201927-12-2019 13:46:11 IST
2019-12-27T08:16:11.256Z27-12-2019 2019-12-27T08:16:09.706Z - - 15-08-2020

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రెండు గంటల 15నిముషాలపాటు భేటీ అయిన మంత్రివర్గం రాజధాని అమరావతితో పాటు ఇతర అంశాలపై సమావేశంలో చర్చించింది. ఈ సమావేశంలో రాజధానిపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మూడు రాజధానులపై కేబినెట్‌ భేటీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత నిర్ణయం ప్రకటించాలని భావిస్తోంది ప్రభుత్వం.

దీంతో పాటు అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, తదుపరి చర్యల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కూడా సమావేశంలో చర్చించారు. రాజధాని ప్రాంత రైతులకు ఎలా న్యాయం చేయాలనే దాని పై చర్చించింది క్యాబినెట్. కర్నూలుకు హైకోర్టు తరలింపు విధివిధానాల పై కేబినేట్ లో చర్చించారు.

విశాఖ పరిపాలన రాజధాని ఏర్పాటు మీద మంత్రులు సూచనలు అడిగారు సిఎం. రాజధానుల అంశంపై అఖిలపక్షం ఏర్పాటు మీద మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు సమాచారం. జీఎన్ రావు కమిటీ నివేదిక మీద చర్చించారు. గత ప్రభుత్వ నిర్ణయాల మీద సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను చర్చించింది క్యాబినెట్.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle