newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

13-11-201913-11-2019 17:05:26 IST
2019-11-13T11:35:26.889Z13-11-2019 2019-11-13T11:35:23.311Z - - 06-12-2019

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ప్రతి నెలా రెండు కేబినెట్‌ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. గత నెలలో రెండు భేటీలు జరిగాయి. ఈ నెలలో ఇవాళ తొలి కేబినెట్‌ సమావేశం జరిగింది.ఇసుక అక్రమ నియంత్రణ చర్యలకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదం లభించింది.

ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే వారికి  రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇకనుంచి రోజుకు 2లక్షల టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామని, ఇసుక కొరత అనేది ప్రతిపక్షాల రాద్ధాంతమే అన్నారు. 

ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలన్నింటిలోను ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయనున్నారు. కమిటీ సూచనలు, పేరెంట్స్‌ అభిప్రాయాల మేరకే ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు. పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికే ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. తప్పనిసరిగా మాతృభాష తెలుగు ఒక సబ్జెక్ట్‌గా ఉంటుందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.  

మరోవైపు మొక్కజొన్న ధరలు పడిపోతుండటంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది.  వారం రోజుల క్రితం మొక్కజొన్న క్వింటాలు ధర రూ.2200 ఉండేదని.. ఇప్పుడు రూ.1500కు పడిపోయిందని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు సీఎంకి వివరించారు. కనీస మద్దతు ధర రూ.1750 కూడా రావడం లేదని మంత్రివర్గం వద్ద ప్రస్తావించారు వ్యవసాయ మంత్రి.  ఈ క్రమంలో రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు. 

మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతులకు నష్టం రాకుండా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో బుధవారం మధ్యాహ్నమే విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు.మత్య్సకారుల సంక్షేమానికి పథకం అమలు చేస్తున్నామన్నారు మంత్రి పేర్ని నాని. వేటకు వెళ్లినవారు ప్రమాదవశాత్తూ చనిపోతే వారికి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 10లక్షలు చెల్లించనున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle