newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

ముగిసిన ఏపీ కేబినెట్ తొలిభేటీ

10-06-201910-06-2019 17:39:58 IST
Updated On 24-06-2019 12:48:25 ISTUpdated On 24-06-20192019-06-10T12:09:58.849Z10-06-2019 2019-06-10T12:09:57.365Z - 2019-06-24T07:18:25.332Z - 24-06-2019

ముగిసిన ఏపీ కేబినెట్ తొలిభేటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌ తొలి కేబినెట్‌ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. ఉదయం ప్రారంభమయిన సమావేశం దాదాపు ఆరు గంటలపాటు జరిగింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిన మంత్రివర్గం అక్టోబర్‌ నుంచి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ. 12,500 ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. వృద్ధాప్య పింఛన్లు రూ. 2,250కి పెంపు, ఆశా వర్కర్లకు రూ. 10వేల వేతనం పెంపు నిర్ణయంపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 

గిరిజన సంక్షేమ శాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు రూ. 400 నుంచి రూ. 4000 వరకు వేతనాల పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడు ఐటీడీఏ పరిధిలోని 7265 మందికి లబ్ది చేకూరనుంది. సీపీఎస్‌ రద్దు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాలపై కమిటీలు వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) పెంపుతో పాటు హోంగార్డులు, మున్సిపల్‌ కార్మికుల వేతనాల పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2020 జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేయాలని వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ఈ పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లుల ఖాతాల్లోకి రూ.15,000 జమ చేయనున్నారు. సీపీఎస్‌ రద్దు చేసిన పక్షంలో ఆ నిధిని వెనక్కు తీసుకోవడంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించడానికి కమిటీ ఏర్పాటుకు వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రతి శాఖలోను అవినీతి జరగకుండా మంత్రులు సర్వశక్తులు ఒడ్డాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. నామినేటెడ్‌ పదవులను రద్దు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle