newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ముఖ్య‌మంత్రి గారూ.. ఇటో క‌న్నేయండి..!

13-11-201913-11-2019 09:23:39 IST
2019-11-13T03:53:39.592Z13-11-2019 2019-11-13T03:53:02.111Z - - 15-12-2019

ముఖ్య‌మంత్రి గారూ.. ఇటో క‌న్నేయండి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోల్చితే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్యేకం. ఇక్క‌డ ఊహించింది ఎన్న‌డూ జ‌ర‌గ‌దు. 2014 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి నిమ్మ‌ల రామానాయుడు 5వేల ఓట్ల‌తో గెలిచారు.

ఇక నాటి నుంచి పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి రోజుకోర‌కంగా మారుతూ వ‌చ్చింది. 2014 నుంచి 2019 ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న గున్నం నాగ‌బాబు కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ పార్టీ విజ‌యం సాధించే స్థాయికి తీసుకొచ్చారు.

కానీ, ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో జ‌రిగిన అంత‌ర్గ‌త రాజ‌కీయాల కార‌ణంగా గున్నం నాగ‌బాబు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయి జ‌న‌సేనలో చేరిపోయారు.

ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌స్తుత న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు ప‌ట్టుబ‌ట్ట‌డంతో పాల‌కొల్లులో గున్నం నాగ‌బాబును మార్చేసి బీజేపీలో ఉన్న డా.బాబ్జీకి వైసీపీ త‌రుపున టికెట్ ఇచ్చారు. కానీ, వైసీపీ ఓడిపోయింది.

మ‌రోసారి టీడీపీ త‌రుపున నిమ్మ‌ల రామానాయుడు గెలిచారు. ఇప్పుడు రాజ‌కీయం పూర్తిగా మారిపోయింది. ఎన్నిక‌ల త‌రువాత వైసీపీలో వ‌ర్గ విభేదాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

డా.బాబ్జి ఓట‌మితో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆ బాధ్య‌త‌లు కూడా మూన్నాళ్ల ముచ్చ‌ట‌గా మారిపోయింది. ఎమ్మెల్యేగా టీడీపీ అభ్య‌ర్ధి గెలిచినా అధికారంలో వైసీపీ ఉండ‌టంతో డా.బాబ్జి ఇంటికి కార్య‌క‌ర్తలు సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం క్యూ క‌ట్టేవారు. ఇంత‌లో మూడు నెల‌ల క్రితం ఆచ‌టం నియోజ‌క‌వ‌ర్గం నుంచి కౌరు శ్రీ‌నివాస్‌ను తీసుకొచ్చి పాల‌కొల్లు ఇన్‌చార్జిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఇలా త‌ర‌చూ ఇన్‌చార్జిల మార్పు గంద‌ర‌గోళానికి కార‌ణ‌మ‌వుతోంద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లే బాహాటంగా అంటున్నారు. ఏ నాయ‌కుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లాలో తెలీక  అయోమ‌యంలో కొట్టుమిట్టాడుతున్నారు. కౌరు శ్రీ‌నివాస్‌ పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు చూస్తుండ‌టంతో బాబ్జి పూర్తిగా వైసీపీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నార‌ట‌.

అంతేకాకుండా, బాబ్జి వైసీపీ కార్య‌క్ర‌మాల‌కు త‌న అనుచ‌రుల‌ను కూడా వెళ్ల‌నీయ‌డం లేద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ నుంచి విన‌వ‌స్తున్న టాక్. ఇలా ఎవ‌రికి వారు సామాజిక స‌మీక‌ర‌ణాల వారీగా త‌మ ప‌ట్టును నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు.

మ‌రికొంద‌రు నాయ‌కులు కూడా ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్టు తెలుస్తుంది. దీంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు గంద‌ర‌గోళం మ‌ధ్య త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక‌నైనా జ‌గ‌న్ ఈ విష‌యంపై క‌న్నేయ‌క‌పోతే పార్టీలో పూర్తిగా ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని కేడ‌ర్ అనుకుంటోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle