ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice Vote Results.

{"1":1400,"2":1716,"3":352,"4":72}

Narendra Modi
1414
Rahul Gandhi
1727
Mayawati
362
Mamata Banerjee
77
BITING NEWS :
*దీదీతో ముగిసిన భేటీ. ఢిల్లీకి చంద్రబాబు*ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో ప్రధాని మోడీ భేటీ *మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబునాయుడు *సోనియాతో మాయావతి భేటీ రద్దు * ఎగ్జిట్ పోల్స్ తో సందడి * ఎన్డీయే వైపు సర్వేల మొగ్గు.. యూపీయేకి పెరగనున్న సీట్లు * ఏపీ ఎన్నికలలో టీడీపీకే మళ్ళీ పట్టం.. లగడపాటి సర్వే * వైసీపీదే ఏపీ.. జాతీయ మీడియాలో మెజారిటీ సర్వేల వెల్లడి *21న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం

ముక్క లేకుండా ముద్దదిగడం లేదు

23-04-201923-04-2019 08:46:43 IST
2019-04-23T03:16:43.200Z23-04-2019 2019-04-23T03:16:32.661Z - - 21-05-2019

ముక్క లేకుండా ముద్దదిగడం లేదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

170... 190...200..210.. ఇవేం ఐపీఎల్ మ్యాచ్‌‌లలో స్కోర్లు కావు. వేసవి ఎఫెక్ట్ మాంసాహార ప్రియులకు చుక్కలు చూపిస్తోంది. కిలో చికెన్‌ రూ.210 దాటడంతో నాన్ వెజ్ తినాలంటే జేబులకు చిల్లులు పడుతున్నాయని వాపోతున్నారు.

ఏడాది ఇదే రికార్డు ధర అంటున్నారు వ్యాపారులు. మరోవైపు చేపలు, మేక మాంసం ధర కూడా అమాంతం పెరిగింది. కొన్నాళ్లుగా ఎండలు విజృంభిస్తున్నాయి. దీంతో కోడి బరువు సగటున అరకిలో వరకు తగ్గిపోతోంది. ఏప్రిల్‌ వరకు ఒక్కో కోడి బరువు 2.3 నుంచి 2.5 కిలోలుండేది. ఇప్పుడది 1.9 కిలోలకు పడిపోయింది. మరోవైపు కోడి పిల్ల రేటు కూడా రూ.42కు భారీగా పెరిగింది. దీంతో కోడి మేతకు బాగా ఖర్చులు పెట్టాల్సి వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు రూ.5 అటుఇటుగా ఇలాగే ఉన్నాయి. జూన్‌ 15 వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు బ్రాయిలర్‌ కోళ్ల పెంపకందార్లు.  కోడి మాంసం ధర కొండెక్కడంతో చేపల ధరలూ పోటీపడుతున్నాయి.

చేపల ధరలు కిలోకు రూ20 పెరిగాయి. మేకమాంసం కిలో రూ. 600 నుంచి 650 వరకు పెరిగింది. ఇలా అనూహ్యంగా పెరుగుతున్న చికెన్, మటన్, చేపల ధరలతో మాంసం ప్రియులు లొట్టలేసుకుని తినడానికి బదులు నిట్టూరుస్తున్నారు. అదేదో సినిమాలో కోడిని ముందు ఉంచుకుని అన్నం తిన్నట్టుగా ఉందంటున్నారు. అటు కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగిపోవడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదంటున్నారు సాధారణ గృహిణులు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle