newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

ముందే చేస్తున్నాం..మీ ఓటు మాకే వెయ్యాలి

03-04-201903-04-2019 07:50:29 IST
Updated On 09-07-2019 15:51:42 ISTUpdated On 09-07-20192019-04-03T02:20:29.800Z03-04-2019 2019-04-03T02:20:25.131Z - 2019-07-09T10:21:42.206Z - 09-07-2019

ముందే చేస్తున్నాం..మీ ఓటు మాకే వెయ్యాలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏడాదిన్న‌ర క్రితం పార్టీ ప్లీన‌రీలోనే ఎన్నిక‌ల శంఖారావం పూరించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అమ‌రావ‌తి ప్రాంతంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలోనే ఆయ‌న న‌వ‌ర‌త్నాలు పేరుతో వైసీపీ అధికారంలోకి వ‌స్తే చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కాలే త‌మ ఎన్నిక‌ల అజెండాగా మార్చుకున్నారు. ఒక‌ర‌కంగా ఈ తొమ్మిది ప‌థ‌కాలే వైసీపీ ప్ర‌ధాన మేనిఫెస్టోగా భావించింది. వీటిని ఇప్ప‌టికే అనేక కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లారు వైసీపీ నేత‌లు. వైఎస్ జ‌గ‌న్ కూడా త‌న పాద‌యాత్ర‌లో ప్ర‌తీ స‌భ‌లోనూ న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ వ‌చ్చారు.

అయితే, స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందు జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కౌంట‌ర్ ఇచ్చేశారు. జ‌గ‌న్ వ‌స్తే ఇవ్వ‌డం ఏంటి నేను ముందే వాటిని అమ‌లు చేసేస్తాను అనేలా ఆయ‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఎక్కువ మంది ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేలా జ‌గ‌న్ చెప్పిన న‌వ‌ర‌త్నాల్లో ప్ర‌ధాన ర‌త్నాల‌ను చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందే అమ‌లు చేసేశారు. ఈ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన త‌మ‌కు ఓటేస్తారా లేదా చేస్తాన‌ని చెబుతున్న జ‌గ‌న్ కు ఓటేస్తారా అన్న‌ట్లుగా తెలుగుదేశం ప్ర‌చారం సాగుతోంది.

ముఖ్యంగా పింఛ‌న్ల‌ను రెట్టింపు చేసి రూ.2 వేల‌కు పెంచుతామ‌ని జ‌గ‌న్ ఏడాదిన్న‌ర క్రిత‌మే హామీ ఇచ్చారు. స‌రిగ్గా మూడు నెల‌ల క్రితం ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబే ఈ పని చేసేశారు. ల‌బ్ధిదారులంద‌రికీ పిలిచి భోజ‌నం పెట్టించి మ‌రీ ఈ పెంచిన పింఛ‌న్ పంపిణీ చేశారు. దీని ప్ర‌భావం ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా ఉండ‌నుంది.

దీంతో షాక్ తిన్న జ‌గ‌న్ రూ.3 వేల‌కు పెంచుకుంటూ పోతామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో చంద్ర‌బాబు మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు. మ‌ళ్లీ గెలిస్తే పింఛ‌న్ రూ.3 వేల‌కు పెంచుతామ‌ని ప్ర‌క‌టించేశారు. ఇలా జ‌గ‌న్ పింఛ‌న్ల హామీ చంద్ర‌బాబుకే ఎక్కువ వ‌ర్కౌట్ అయ్యేలా ఉంది. స‌హ‌జంగా ఏదో చేస్తామ‌ని చెప్పిన వారి కంటే ఇప్ప‌టికే చేస్తున్న వారి ప‌ట్ల‌నే న‌మ్మకం ఎక్కువ ఉంటుంది.

అమ్మఒడి అనే ఓ ప‌థ‌కాన్ని జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల్లో భాగంగా రూపొందించారు. చ‌దువుకు దూర‌మ‌వుతున్న పిల్ల‌ల‌ను చ‌దివించేందుకు గానూ త‌ల్లుల‌కు ఏడాది రూ.15 వేలు ఇస్తామ‌ని, పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌కు పంపిస్తే చాల‌నేది ఈ ప‌థ‌కం ఉద్దేశ్యం. దీనికి కూడా చంద్ర‌బాబు కౌంట‌ర్ ఇచ్చేశారు. ప‌సుసు - కుంకుమ పేరుతో ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందే కొత్త ప‌థ‌కం తీసుకువ‌చ్చారు. ప్ర‌తీ డ్వాక్రా మ‌హిళ‌కు రూ.10 వేలు ఇస్తున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ గెలిపిస్తే ప్ర‌తీయేటా ప‌సుపు కుంకుమ ఇస్తాన‌ని, ఏకంగా యేటా రూ.20 వేలు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో జ‌గ‌న్ చెప్పిన ఈ ర‌త్నం కూడా చంద్ర‌బాబు ముందే అమ‌లు చేసిన‌ట్ల‌యింది.

ఇక‌, ఆటోల‌కు, వ్య‌వ‌సాయ ట్రాక్ట‌ర్ల‌కు లైఫ్ ట్యాక్స్ ర‌ద్దు చేస్తాన‌ని జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల్లో భాగంగా ప్ర‌కటించారు. ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు చంద్ర‌బాబు కూడా ఈ హామీని అమ‌లు చేసేశారు. ఆటోలు, ట్రాక్ట‌ర్ల‌పై ట్యాక్స్ ర‌ద్దు చేసి తానే డ్రైవ‌ర్ నెంబ‌ర్ 1 అని ప్ర‌క‌టించుకున్నారు. అంతేకాదు టీడీపీ కోసం ఆటో వెన‌కాల టాంక్యూ సీఎం స‌ర్ అని రాసుకొని ప్ర‌చారం చేయాల‌ని కూడా కోరారు. దీంతో ఈ హామీ కూడా చంద్ర‌బాబు ఖాతాలో ప‌డిపోయింది.

వైఎస్ఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల్లో ప్ర‌ముఖ‌మైన‌ది ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం. ఈ ప‌థ‌కం ఇప్పుడు ఏపీలో చికిత్స చేయించుకుంటేనే అమలులోకి వ‌స్తోంది. హైద‌రాబాద్ స‌హా ఇత‌ర ప్రాంతాల్లో చికిత్స చేయించుకుంటే ఈ ప‌థ‌కం కింద అర్హులు కారు. దీంతో రూ.వెయ్యి దాటిన ప్ర‌తీ చికిత్స ఆరోగ్య శ్రీ కింద తీసుకువ‌స్తామ‌ని, ఎక్క‌డ చికిత్స చేయించుకున్నా ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌ని జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల్లో చెప్పారు. దీనిని కూడా ఇటీవ‌ల చంద్ర‌బాబు ఓన్ చేసేసుకున్నారు. ఆరోగ్య‌శ్రీ కింద ఎక్క‌డ చికిత్స చేసుకున్నా, ఎక్క‌డ మందులు తీసుకున్నా ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌ని చెప్పేశారు.

ఇలా, జ‌గ‌న్ ఏడాది ముందు అట్ట‌హాసంగా ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లిన న‌వ‌ర‌త్నాలు త‌మ‌కు మేలు చేస్తాయ‌ని వైసీపీ అనుకుంది. కానీ వాటిని చంద్ర‌బాబు ముందే అమ‌లు చేసి క్రెడిట్ త‌న ఖాతాలో వేసేసుకున్నారు. చంద్ర‌బాబు ఈ ప‌థ‌కాల‌ను ముందే చేసేసారు కదా అనుకుంటే ల‌బ్ధిదారులు టీడీపీ వైపు ఉండే అవ‌కాశం ఉంది. జ‌గ‌న్ చెప్పారు కాబ‌ట్టి చంద్ర‌బాబు ఎన్నిక‌ల వేళ అమ‌లు చేశార‌ని ప్ర‌జ‌లు ఆలోచిస్తే మాత్రం జ‌గ‌న్ వైపు ఉండ‌నున్నారు.

న‌వ‌ర‌త్నాల్లో స‌గం ప‌థ‌కాలు ఇప్ప‌టికే అమ‌లులోకి రావ‌డంతో మ‌రిన్ని ప‌థ‌కాల‌తో వైసీపీ కొత్త మేనిఫెస్టో సిద్ధం చేసింది. కానీ ఇంకా టీడీపీ మేనిఫెస్టో విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో న‌వ‌ర‌త్నాల అనుభ‌వంతో టీడీపీ మేనిఫెస్టో విడుద‌ల‌య్యాకే త‌మ మేనిఫెస్టో విడుద‌ల చేయాల‌ని భావిస్తోంది. దీంతో ఎన్నిక‌ల‌కు ఇంకా వార‌మే ఉన్నా ఇప్ప‌టివ‌ర‌కు రెండు ప్ర‌ధాన పార్టీల మేనిఫెస్టోలు విడుద‌ల కాలేదు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle