newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

ముందూవెనుక చూసుకోరా..? మొండిగా ముందుకెళ్ల‌డ‌మేనా..?

05-09-201905-09-2019 15:18:32 IST
Updated On 05-09-2019 15:26:48 ISTUpdated On 05-09-20192019-09-05T09:48:32.583Z05-09-2019 2019-09-05T09:48:30.987Z - 2019-09-05T09:56:48.852Z - 05-09-2019

ముందూవెనుక చూసుకోరా..? మొండిగా ముందుకెళ్ల‌డ‌మేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వంద రోజుల పాల‌న పూర్తి చేసుకున్నారు. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఆయ‌న పాల‌న‌లో త‌న‌దైన ముద్ర చూపిస్తున్నారు.

ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా జ‌గ‌న్ మాత్రం పాల‌న‌లో వ‌డివ‌డి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ప‌లు కీల‌క అంశాల‌పై ఆయన మొండిగా ముందుకు వెళుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా ఇబ్బందుల‌ను ప‌ట్టించుకోకుండా ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప్ర‌త్య‌ర్థుల‌కే కాదు పార్టీ శ్రేణుల‌కు కూడా అంతుచిక్క‌డం లేదు.

రెండు పేజీల మేనిఫెస్టో అంటూ జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు వెళ్లారు. అయితే ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా త‌న సుదీర్ఘ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ వివిధ జిల్లాల్లో అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచే ఈ హామీలు అమ‌లు చేయాల‌నే ఆతృత‌తో జ‌గ‌న్ ఉన్నారు. అధికారులు, మంత్రులు వాదించినా ఆయ‌న మాత్రం మొండిగానే ముందుకెళుతున్నారు.

అధికారంలోకి రాగానే ప్ర‌జావేదిక కూల్చివేయాల‌ని జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఎంత వివాదాస్ప‌ద‌మైందో అంద‌రికీ తెలిసిందే. త‌ర్వాత ఆయ‌న ప్ర‌భుత్వ ఉద్యోగులు, ప్ర‌భుత్వానికి అనుబంధంగా ప‌నిచేసే వారి జీతాల పెంపుపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని ప‌క్క‌న పెట్టి మ‌రీ ఆయ‌న ఉద్యోగుల్లో సంతృప్తి నిండేలా జీతాలు పెంచారు. ఓ ద‌శ‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల్లో పారిశుధ్య కార్మికుల వేత‌నాలు రూ.18 వేల పెంచాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో సీఎస్ క‌ల్పించుకొని పున‌రాలోచించుకోంండి సార్ అని చెప్పాల్సి వ‌చ్చింది.

నిన్న జ‌రిగిన క్యాబినెట్ భేటీలోనూ ఇటువంటి నిర్ణ‌యాలే జ‌గ‌న్ తీసుకున్నారు. అన్ని హామీల‌ను మొద‌టి ఏడాదే వ‌రుస‌గా అమ‌లు చేస్తే రాజ‌కీయంగా మైలేజ్ రాద‌ని, కాబ‌ట్టి విడ‌త‌ల వారీగా అమ‌లు చేయాల‌ని ప‌లువురు మంత్రులు జ‌గ‌న్‌కు సూచించారు.

మంత్రుల వాద‌న‌ను జ‌గ‌న్ ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. అన్ని హామీలూ ముందే అమ‌లు చేద్దామ‌ని చెప్పేశారు. 51 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యం కూడా సంచ‌ల‌న‌మే. అనేక ఏళ్లుగా ఉద్యోగులు ఈ డిమాండ్ చేస్తున్నా ఆర్థికంగా పెనుభారం కావ‌డంతో ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌లేక‌పోయాయి.

అటువంటి జ‌గ‌న్ ఏమాత్రం ఆలోచించ‌కుండా విలీనం చేసేశారు. అయితే, రాష్ట్ర ఆర్థిక లోటు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక మాంధ్యం, ఇటీవ‌ల ప్ర‌భుత్వ ఆదాయం సైతం త‌గ్గిపోవ‌డం వంటి ఇబ్బందులు ఉన్నాయి.

మిగులు బ‌డ్జెట్ ఉన్న తెలంగాణ ప్ర‌భుత్వ‌మే ఆర్థిక మాంధ్యం నేప‌థ్యంలో కొంత ఆచితూచి డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టాల‌ని నిర్ణ‌యించింది. కానీ, జ‌గ‌న్ మాత్రం ఈ అంశాల‌ను ప‌ట్టించుకోకుండా మొండిగా ముందుకెళుతున్నారు. ఆదాయాన్ని పెంచుకోవాల‌ని కానీ హామీలు అమ‌లు కావాల్సిందే అని క్యాబినెట్ స‌మావేశంలో స్ప‌ష్టం చేశారు.

ఇక‌, గ్రామ స‌చివాల‌యాల్లో ఉద్యోగాల భ‌ర్తీ అంశంపై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు పార్టీ కార్య‌క‌ర్త‌లైనా ప్ర‌తిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాల‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇది అంద‌రికీ బాగానే ఉన్నా క్యాడ‌ర్‌లో కొంత అసంతృప్తి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మంత్రివ‌ర్గ కూర్పు స‌మ‌యంలోనూ జ‌గ‌న్ వైఖ‌రి కార‌ణంగా వైసీపీకి అండ‌గా ఉండే ఓ ప్ర‌ధాన సామాజ‌క‌వ‌ర్గం నేత‌లు అసంతృప్తికి గుర‌య్యారు. అయితే, ప్ర‌జ‌లు త‌మ‌పై అనేక అంచ‌నాలు, ఆశ‌లు పెట్టుకొని భారీగా సీట్లు ఇచ్చినందున ఇటువంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం త‌ప్ప‌ద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle