newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..!

23-12-201923-12-2019 07:29:08 IST
Updated On 23-12-2019 11:38:39 ISTUpdated On 23-12-20192019-12-23T01:59:08.238Z23-12-2019 2019-12-23T01:59:03.889Z - 2019-12-23T06:08:39.598Z - 23-12-2019

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అత్యంత గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. తెలంగాణ‌కు అనుకూలం అంటే సీమాంధ్ర‌లో పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంద‌ని, స‌మైఖ్యాంధ్ర‌కు అనుకూలం అటే తెలంగాణ‌లో న‌ష్టం జ‌రుగుతుంద‌నే భ‌యంతో ఆయ‌న యూట‌ర్న్‌లు తీసుకున్నారు.

ఇప్పుడు రాజ‌ధాని వ్య‌వ‌హారంలోనూ చంద్ర‌బాబు నాయుడు ఇంతే గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. రాజ‌ధానిపై ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న‌ట్లుగా చంద్ర‌బాబు ప‌రిస్థితి మారిపోయింది.

అమ‌రావ‌తి చంద్ర‌బాబు నాయుడు క‌ల‌ల రాజ‌ధాని. అమ‌రావ‌తిని అభివృద్ధి చేసి మ‌హాన‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని ఆయ‌న ఆశ‌ప‌డ్డారు. అయితే, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం, డిజైన్ల పేరుతో ఆలస్యం చేయ‌డం, రాజ‌ధాని అంద‌రిదీ అనే భ‌రోసా అన్ని జిల్లాల ప్ర‌జ‌ల్లో క‌లిపించ‌డంలో చంద్ర‌బాబు నాయుడు విఫ‌లం కావ‌డంతో ఇప్పుడు రాజ‌ధాని మార్చే ప‌రిస్థితి వ‌చ్చింది. కానీ, అమ‌రావ‌తిని నిర్మించాల‌నే చంద్ర‌బాబు సంక‌ల్పాన్ని మాత్రం శంకించ‌లేం.

ఇప్పుడు త‌న క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాధాన్యాన్ని త‌గ్గించే దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ పెద్ద క‌స‌ర‌త్తునే చేస్తోంది. ఏదో అద్భుతం జ‌రిగితే త‌ప్ప అమ‌రావ‌తి పూర్తి స్థాయి రాజ‌ధానిగా కొన‌సాగే ప‌రిస్థితి లేదు.

అయితే, ఇంత జ‌రుగుతున్నా చంద్ర‌బాబు మాత్రం గ‌ట్టిగా అమ‌రావ‌తిలోనే పూర్తి స్థాయి రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని గ‌ట్టిగా డిమాండ్ చేయ‌లేక‌పోతున్నారు. ఆందోళ‌న చేస్తున్న అమ‌రావ‌తి ప్రాంత రైతుల‌తో క‌లిసి ఆందోళ‌న‌లు చేయ‌లేక‌పోతున్నారు.

ఇప్పుడు జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన మూడు రాజ‌ధానుల అంశం రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు సంబంధించిన‌దిగా మారిపోయింది. క‌ర్నూలును జ్యుడీషియ‌ల్ రాజ‌ధానిగా చేయ‌డాన్ని చంద్ర‌బాబు వ్య‌తిరేకిస్తే ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌లో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీకి మ‌రింత న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది.

ఇక‌, విశాఖ‌ప‌ట్నంలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిట‌ల్‌ను వ్య‌తిరేకిస్తే ఉత్త‌రాంధ్ర అభివృద్ధిని చంద్ర‌బాబు అడ్డుకుంటున్నార‌నే భావ‌న అక్క‌డి ప్ర‌జ‌ల్లో క‌లిగవ‌చ్చు. ఉత్త‌రాంధ్ర ప్రాంతం టీడీపీకి ముందు నుంచీ అండ‌గా ఉంటోంది. అక్క‌డ పార్టీకి న‌ష్టం జ‌రిగే ప‌రిస్థితిని చంద్ర‌బాబు నాయుడు తెచ్చుకోలేరు.

అలా అని త‌న‌పై న‌మ్మ‌కంతో రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై ఉంది. దీంతో ఆయ‌న ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న‌ట్లుగా త‌యారైంది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కైతే అప్ప‌టి తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అవ‌లంభించిన వైఖ‌రినే టీడీపీ ఎంచుకుంది. ఏ ప్రాంత నేత‌లు ఆ ప్రాంత ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle