newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

మీ ముందున్న కర్తవ్యం.. మన ప్రభుత్వం

22-03-201922-03-2019 12:36:15 IST
2019-03-22T07:06:15.462Z22-03-2019 2019-03-22T07:06:11.948Z - - 18-07-2019

మీ ముందున్న కర్తవ్యం.. మన ప్రభుత్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన గెలుపు కోసం కొత్త నాటకాలు మొదలెట్టారని, వాటికి మోసపోవద్దన్నారు. వైఎస్ ఫ్యామిలీని పులివెందుల ప్రజలు బాగా ఆదరించారని, మళ్ళీ తనను ఆశీర్వదించి, మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చేందుకు కృషిచేయాలన్నారు. చీకట్లో నుంచి నిజం బయటకు రాకమానదన్నారు. స్వంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి ప్రజల్ని మోసం చేయడం వెన్నతోపెట్టిన విద్య అన్నారు.

వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని జగన్ శుక్రవారం పులివెందుల్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దివంగత నేతలు వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌రాజశేఖర్‌ రెడ్డి, వివేకానంద రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. మ.1.49 గంటలకు పులివెందులలో వైఎస్‌ జగన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జగన్ సభ సందర్భంగా జనసంద్రంగా మారింది పులివెందుల.

సీఎం జగన్‌ ...సీఎం జగన్ అనే నినాదాలతో మార్మోగింది సభా ప్రాంగణం. చంద్రబాబు మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నారని, డబ్బులు వెదజల్లబోతున్నారని అంతా జాగ్రత్తగా ఓటు వేయాలన్నారు జగన్. పులివెందులలో మీరు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుకి బాట కావాలన్నారు. చంద్రబాబు హయాంలో కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎదురుచూపులే మిగిలాయన్నారు. పులివెందులకు వచ్చి చంద్రబాబు మోసం చేసే మాటలు మాట్లాడారన్నారు. పులివెందుల గడ్డ మీడ పుట్టినందుకు గర్వ పడుతున్నా అన్నారు జగన్. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్యే కారణమన్నారు జగన్. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle