newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు

19-11-201919-11-2019 13:15:25 IST
Updated On 19-11-2019 15:16:30 ISTUpdated On 19-11-20192019-11-19T07:45:25.067Z19-11-2019 2019-11-19T07:44:51.330Z - 2019-11-19T09:46:30.975Z - 19-11-2019

‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో ఇసుకను మించిన కథావస్తువు లేదు. ఇటు అధికార పార్టీ బోలెడంత ఇసుక దొరుకుతోందంటూ ప్రకటనలు చేస్తుంటే.. విపక్షాలు మాత్రం ఇసుక దొరకడంలేదంటూ గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.  

మీ పేపర్లో దొరుకుతున్న ఇసుక బయట ప్రజలకు దొరకడం లేదు జగన్ గారూ అంటూ ఎద్దేవా చేశారు. ఇసుక అక్రమార్కుల పై ఉక్కుపాదం మోపుతాం అంటూ భారీగా ప్రకటనలు ఇస్తున్నారు. మీరు చెప్పిన టోల్ నెంబర్ నిజంగా పనిచేస్తే మీ పార్టీ ఇసుకాసురుల కోసం పక్క రాష్ట్రం జైళ్లు కూడా అద్దెకు తీసుకోవాలి. మీ నూతన ఇసుక పాలసీ వలన 50 మంది కార్మికులు బలయ్యారన్నారు లోకేష్. 

నిర్మాణ రంగం పడకేసి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇసుక రేటుని మీ నాయకులు పెంచుకుంటూ పోతున్నారు. మీ పత్రికలో ప్రకటనలకు కోసం వృధా అవుతున్న ప్రజా ధనంతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటే సంతోషిస్తాం.. అంటూ లోకేష్ ట్వీటేశారు. 

ఇసుకపై అటు జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీలు కూడా సత్యాగ్రహాలకు దిగాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విపక్షాలపై మాటల దాడి చేస్తున్నాయి. ఇసుకను ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటోంది ప్రభుత్వం. ఇసుక అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గట్టి చర్యలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇసుక అక్రమాల నిరోధానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

తాజాగా ఇలాంటి అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం టోల్‌ ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తెచ్చింది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ 14500 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ఈ నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని జగనే ప్రకటించారు. టోల్ ఫ్రీ నెంబరు ద్వారా వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిశీలిస్తామని, కఠినచర్యలు తప్పవన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle