newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

13-11-201913-11-2019 16:07:16 IST
2019-11-13T10:37:16.619Z13-11-2019 2019-11-13T10:37:06.816Z - - 05-08-2020

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేను ప్రభుత్వ పాలసీలపై విమర్శించినప్పుడల్లా నా మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ తిరుగు దాడి చేస్తున్నారు.. మీరు కూడా చేసుకోండి మూడు పెళ్లిళ్లు.. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని అంటూ జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్ వేశారు. తన వివాహ జీవితంపై సీఎం జగన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అయితే ఇలాంటి మురికి రాజకీయాలను చేయడం ఆపాలంటూ వైఎస్సార్ సీపీని కోరతూనే అదేసమయంలో జగన్‌ని వెక్కిరిస్తూ పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా చేయాలంటూ తన ప్రభుత్వం జారీచేసిన ఆదేశాన్ని ఏపీలోని రాజకీయ పార్టీల నేతలందరూ వ్యతిరేకించడంపై ముఖ్యమంత్రి జగన్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలతో దాడి చేశారు. సినీ నటుడు పవన్ కల్యాణ్‌ని ప్రశ్నిస్తున్నాను. నీకు ముగ్గురు భార్యలున్నారు బహుశా నలుగురో అయిదుగురో పిల్లలుంటారు. నీ పిల్లలకు ఏ మీడియంలో చదువు చెప్పిస్తున్నావు అని అడగుతున్నాను... అని జగన్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు  మంగళవారం విజయవాడలో జరిగిన బహిరంగ సభలో పవన్ స్పందించారు. నేను విమర్శించిన ప్రతిసారీ, నా మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ ప్రతిదాడి చేస్తున్నారు. మీరు  కూడా పెళ్లిళ్లు చేసుకోవచ్చు. మిమ్మల్ని ఇక్కడ ఆపుతున్నదెవరు?  వివాహ జీవితం నాకు పనిచేయలేదు కాబట్టే మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే మీరెందుకు అంత అసంతృప్తి చెందుతున్నారు అని పవన్ ఎదురు ప్రశ్నించారు.

అయినా నేను మూడుసార్లు పెళ్లి చేసుకుంటేనే మీరు రెండేళ్లు జైల్లో గడిపారా అని పవన్ వ్యంగ్యం ప్రదర్శించారు. దయచేసి సభ్యతగా మాట్లాడండి అంటూ జగన్‌ని కోరారు. తాను, తన పార్టీ ఎన్నడూ ప్రభుత్వ విధాన నిర్ణయాలపైనే విమర్శ చేస్తూ వచ్చాం, దానికి ఆరోగ్యకరమైన విమర్శలు మాత్రమే ఆశిస్తున్నామని పవన్ చెప్పారు.

అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా చేస్తుండటంపై తన వ్యతిరేకతకు వివరణ ఇచ్చేందుకు పవన్ ప్రయత్నించారు. అంతర్జాతీయ భాషగా ఇంగ్లీషును ఎవరూ వ్యతిరేకించలేదు. కానీ దాని అమలులో తగిన పద్ధతిని పాటించాలి అని పవన్ చెప్పారు.

ఇసుక విధానంలో సవరణ విఫలమైందని, అనేక మంది ఉపాధి కోల్పోయి చనిపోతున్నారని  పవన్ విమర్శించారు. ఇసుకవిధానంలో సవరణ కారణంగా గత నాలుగు నెలల్లో రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా మారింది. టీచర్లకు శిక్షణ ఇవ్వకుండా, ఇంగ్లీషు నైపుణ్యాలను నేర్చించకుండా ప్రభుత్వం ఉన్నట్లుండి ఇంత భారీ మార్పుకు ఎలా పూనుకుంటుంది అని పవన్ ప్రశ్నించారు.

ఇరుపక్షాల నుంచి విమర్శలు ఇలా సాగుతుండగా పవన్ కల్యాణ్ తన కుమారుడు చదువుతున్న ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ని ప్రమోట్ చేస్తున్న వీడియోను వైకాపా మద్దతుదారులు షేర్ చేశారు. ఇది మరొక వివాదానికి కారణమవుతుందేమో చూడాలి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle