newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

27-05-202027-05-2020 19:15:14 IST
Updated On 28-05-2020 09:16:44 ISTUpdated On 28-05-20202020-05-27T13:45:14.967Z27-05-2020 2020-05-27T13:44:55.390Z - 2020-05-28T03:46:44.482Z - 28-05-2020

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వార్తలు, వ్యాఖ్యల విషయంలో మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో నియంత్రణ పాటించాలన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.  సమాచార, ప్రసార ధ్యమాలు నియంత్రణలో, చట్టపరిధిలో ఉండాలన్నారు డీజీపీ గౌతం సవాంగ్‌. ఈమేరకు కొన్ని మార్గదర్శకాలు, సూచనలు చేశారు. 

1) ఈ మధ్య కాలంలో మీడియా (ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మరియూ సోషల్‌ మీడియా) లో  నియంత్రణ లేకుండా  రెచ్చ గొట్టే విధంగా ప్రచురిస్తున్న వార్తలు/ వ్యాఖ్యల వల్ల సమాజంలో అలజడి రేగుతోంది. పరిస్థితులు వ్యక్తిగత దూషణల నుండి మొదలై వైషమ్యాల వైపునకు దారితీస్తున్నాయి. ఫలితంగా అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు సమాజానికీ, వ్యవస్థకూ మంచిదికాదు. 

2) ఇట్టి పోకడలను అరికట్టే క్రమంలో పోలీసు శాఖ ఈ మధ్య కాలంలో శాఖా పరమైన వ్యవస్థ లను పటిష్టం చేసుకుంటోంది. సీఐడీ విభాగంలోని సైబర్‌ క్రై మ్‌ వింగ్‌ లో సోషల్‌ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు  ప్రత్యేకంగా మరో వింగ్‌ ను  ఏర్పాటు చేసాం. ఇప్పటికే పలు ఫిర్యాదులు రావడం, వాటి దర్యాప్తు వేగవంతం చేయడం జరుగుతూ ఉంది. 

3) అదే విధంగా మాధ్యమాలలో  రాజ్యాంగ బద్ద సంస్థల పట్ల మరియు ఆ సంస్థల నిర్వహణలో ఉన్న వ్యక్తుల పట్ల వ్యాఖ్యలు చేయడం, వాటిని ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోవడం సరికాదు. ప్రచురించే, ప్రసారంచేసే సమాచారంలో, అభిప్రాయాల వ్యక్తీకరణలో చట్టాలను అనుసరించాలి. వక్రీకరణ, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇవ్వడం, ఊహాజనిత అంశాలను ప్రసారంచేయడం, ప్రచురించడం, అశ్లీల, అసభ్యకర, నిందపూర్వక, అభ్యంతరకర వ్యాఖ్యానాలు చేయడం గర్హనీయం. ఈ విషయంలో చట్ట ప్రకారం వ్యవహరిస్తామని పునరుద్ఘాటిస్తున్నాం. పోలీసు శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వ్యక్తులను ఉపేక్షించదు. నిష్ఫక్షపాతంగా ముందుకు వెళ్తాం. 

4) ఇటీవల గౌరవ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పట్ల, వారి తీర్పుల పట్ల కొందరు చట్టాన్ని అతిక్రమించి వ్యాఖ్యలు చేశారన్న విషయంలో హై కోర్ట్‌ ఇచ్చిన ఫిర్యాదు పై దర్యాప్తు వేగవంతం చేసాం. అలాగే ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తులమీద కూడా తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు ప్రచారంచేసి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్ననిస్తున్నారు. వీటన్నింటిమీద పోలీసుల కన్ను ఉంది. 

5) మనం పరిణిత చెందిన సమాజంలో ఉన్నామని విషయాన్ని అందరూ గుర్తించాలి. ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ పరంగా ఏర్పడ్డ సంస్థల  గౌరవానికి, వ్యవస్థల గౌరవానికి భంగం కలిగేలా  ప్రవర్తించరాదని మరోసారి హెచ్చరిస్తున్నాం.

6) ప్రింట్‌మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురుణలు, ప్రసారాలు చేసేవారు, అభిప్రాయలు వ్యక్తీకరించేవారు నియంత్రణ పాటించక పోతే అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

   3 hours ago


ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

   3 hours ago


స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

   3 hours ago


భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

   4 hours ago


బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

   6 hours ago


ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

   8 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

   8 hours ago


ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

   8 hours ago


వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

   20-09-2020


కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

   20-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle