newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

మీడియా మేనేజర్లు వేస్ట్... సోషల్ మీడియానే బెస్ట్: వైఎస్ జగన్

13-11-201913-11-2019 12:18:08 IST
2019-11-13T06:48:08.361Z13-11-2019 2019-11-13T06:47:56.371Z - - 28-02-2020

మీడియా మేనేజర్లు వేస్ట్... సోషల్ మీడియానే బెస్ట్: వైఎస్ జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక విషయంలో స్పష్టత వచ్చేసినట్లు ఉంది. వివిధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని ఖండించడంలో తన మీడియా మేనేజర్లు విఫలమవుతుండటం పట్ల జగన్ ఏమాత్రం సంతృప్తికరంగా లేరని ఫీలవుతున్నారని సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ప్రచార విభాగం ప్రభుత్వం చేపడుతున్న వివిధ విధాన నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియపరుస్తూనే ఉంది. ఇక మంత్రులు, వైకాపా అధికార ప్రతినిధులూ క్రమం తప్పకుండా ప్రెస్ కాన్పరెన్సులు నిర్వహిస్తూ ప్రతిపక్షాల విమర్శలకు ప్రతి దాడి చేస్తూనే ఉన్నారు.

అయినప్పటికీ తన సొంత మీడియా అయిన సాక్షి ని మినహాయిస్తే  ప్రభుత్వ వెర్షన్, పార్టీ వెర్షన్ ప్రజలకు సమర్థంగా చేరడం లేదని జగన్ భావిస్తున్నారు. ప్రతిపక్ష నేతల ప్రకటనలకు, వ్యాఖ్యలకు మీడియాలో పెద్దగా ప్రచారం జరుగుతోందని కానీ ప్రభుత్వం వైపునుంచి సకాలంలో ప్రతి దాడి చేయలేకపోవడం వల్ల వెనుకబడుతున్నామని జగన్ అభిప్రాయపడుతున్నారని తెలిసింది.

ఉదాహరణకు తాడేపల్లిలోని జగన్ అధికార నివాసానికి రూ. 15.65 కోట్ల ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌కు జాతీయ మీడియాలో పెద్దగా కవరేజ్ వచ్చిందని సీఎం దృష్టికి వచ్చింది. అలాగే తన ఇంటికి వెళ్లే రోడ్డు విస్తరణ పనులకు కూడా కోట్లు ఖర్చుపెట్టినట్లు ప్రచారం జరగడంతో జగన్ ఖిన్నులయ్యారని సమాచారం.

అందుకని మీడీయా మేనేజర్లను నమ్ముకోవడం కంటే సోషల్ మీడియాను, ప్రభుత్వ డిజిటల్ మీడియాను బలోపేతం చేయడం మంచిదని, అప్పుడే ప్రతిపక్షాల విమర్శలను కౌంటర్ చేయడమే కాకుండా ప్రభుత్వ నిర్ణయాలను సులువుగా, సమర్థవంతమైన పద్ధతిలో ప్రచారం చేయవచ్చని జగన్ దృఢంగా నిర్ణయించుకున్నారని సమాచారం.

అదేసమయంలో భారతీయ జనతా పార్టీ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ సోషల్ మీడియాను ఎలా నిర్వహిస్తున్నారో అధ్యయనం చేయాలని జగన్ తన మీడియా మేనేజర్లకు సూచించినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాలను ఒక్క నిమిషం పాటయినా వృధా చేయకుండా బీజేపీ సోషల్ మీడియా బృందం ట్విట్టర్, ఫేస్‌బుక్ లలో వెనువెంటనే ఎలా ప్రచారం చేస్తోందో పరిశీలించాలని జగన్ కోరినట్లు సమాచారం.

వైఎస్సార్ ప్రభుత్వం కూడా ప్రజలకు నేరుగా సమాచారం అందించడానికి తన సొంత సోషల్ మీడియా యంత్రాంగాన్ని రంగంలోకి దింపాలని జగన్ సూచించినట్లు వైకాపా వర్గాలు తెలిపాయి.

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   3 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   6 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   6 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   11 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   11 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   12 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   13 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   13 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   14 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle